ఈ నెలలో పూర్తి చెయ్యాల్సిన ముఖ్యమైన 5 పనులు ఇవే..

-

కొత్త ఏడాది మార్చి నెల వచ్చేసింది.. ఈ నెల చివరి నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం కూడా మొదలవుతుంది.. అంటే ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే ఈనెల 31 లోగా చేసుకోవాలి.. అందువల్ల వచ్చే నెల నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందువల్ల ఈ నెల చివరి కల్లా ఏ ఏ పనులను పూర్తి చేయాలో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

 

పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మార్చి 31 గడువుగా ఉంది. ఒకవేళ ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే మాత్రం ఆ పాన్ కార్డు చెల్లదు. అప్పుడు మీకు పాన్ కార్డు లేనట్లే అవుతుంది. తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది..పాన్ కార్డు లేకుంటే బ్యాంకు అకౌంట్ కూడా తెరవరు..ఐటీఆర్ రిఫండ్ రాదు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయలేరు. అలాగే టీడీఎస్ వంటివి ఎక్కువగా కట్ అవుతాయి. పాన్ ఆధార్ లింక్ లేట్ ఫీజు రూ.1000గా ఉంది. అందువల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.. అందుకే వెంటనే పాన్ ఆధార్ కార్డు చేసుకోవాలి.. లింక్ చేసుకోవాలి..

ఇకపోతే అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్‌లైన్ మార్చి 15గా ఉంది. అందువల్ల మీరు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటే.. ఇప్పుడే ఆ పని పూర్తి చేసుకోండి..వయ వందన యోజన స్కీమ్ మార్చి 31 వరకే అందుబాటులో ఉంటుంది. అందువల్ల సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరాలని భావిస్తే.. వెంటనే ఆ పని పూర్తి చేసుకోండి. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ వస్తోంది..

అదే విధంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎవరైనా ట్యాక్స్ సేవింగ్ పొందాలని భావిస్తే.. అందుకు అనుగుణంగా మార్చి 31లోపు డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవాలి. వివిధ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్ పొందొచ్చు..2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్‌డేటెడ్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడానికి మార్చి 31తో గడువు ముగుస్తుంది.. దీనికి సంబందించిన అప్డేట్ ను వెంటనే అప్డేట్ చేసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news