ఈ ఏడాదిలో పాఠశాలల పనిరోజులు ఎన్నో తెలుసా..?

తెలంగాణలో వచ్చేనెల నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలని తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో విద్యాశాఖ అ«ధికారులు ఆయా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలను నడిపి మేలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని ఆ శాఖ భావిస్తోంది. దీని ప్రకారం 20–21 సంవత్సంలో పాఠశాలలు కేవలం 65–70 రోజులే పనిచేస్తాయి. బడికి రావాలంటే లిఖీతపూర్వకంగా తల్లిదంద్రుల అంగీకారం తప్పనిసరి చేశారు. భౌతికదూరం నేపథ్యంలో ఒక్కో తరగతి గదిలో కేవలం 20 మంది విద్యార్థులకే అనుమతిస్తారు.

 

ఏప్రిల్‌ చివరి వరకే..

ఫిబ్రవరి, మార్జి ఏప్రిల్‌ మూడు నెలలు కలిపి 89 రోజులు కాగా, వాటిలో ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు తీయగా మిగిలేవి 70 రోజులు మాత్రమే. అయితే.. రెండో శనివారం కూడా తరగతులు కొనసాగుతాయి. ఇంట్రెన్స్, అడ్మీషన్స్, ఇంటర్‌ పరీక్షలతో ముడిపడి ఉంటాయి కాబట్టి ఆ పరీక్షలను ఏప్రిల్‌ చివరి వారంలో ప్రారంభిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. మే 24 తర్వాత జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ఉంటాయి. ఇంటర్‌ పరీక్షలు పూర్తవ్వగానే పది పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం పదికి ఆరు పరీక్షలే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తరగతులకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉండి, సౌకర్యాలు తక్కువ ఉంటే షిఫ్ట్‌ విధానంలో కూడా పాఠశాలలు నడపవచ్చు. ఉదయం 10వ తరగతి, మధ్యాహ్నం 9వ తరగతికి పాఠాలు బోధించవచ్చని అధికార యంత్రాంగం తెలిపింది.