మీ ఆధార్ తో ఏదైనా మోసం జరిగిందా అనేది ఇలా చెక్ చేసుకోచ్చు..!

-

మనకి ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్ల లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ అన్నిటికీ ఉపయోగ పడుతుంది. ప్రభుత్వ స్కీములు మొదలు బ్యాంక్ అకౌంట్ వరకు ఆధార్ కార్డు చాలా అవసరం. అయితే నిజానికి ఆధార్ కార్డు లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఆధార్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి దాన్ని దుర్వినియోగం కూడా ఎక్కువ చేస్తున్నారు. అయితే ఆధార్ లో ఉండే ప్లస్ ఏమిటంటే మీరు మీ ఆధార్ కార్డ్ ని ఎక్కడ ఉపయోగించారు..?, ఎప్పుడూ ఉపయోగించారు అనే ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవచ్చు.

మీకు కనుక ఎప్పుడైనా మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయిందని అనుమానం కలిగితే ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు. ఆధార్ వెబ్ సైట్ లోకి వెళ్ళి గత ఆరు నెలల్లో ఆధార్ కార్డు ఎక్కడ ఎక్కడ ఉపయోగించారు అనే విషయాల్ని మీరు తెలుసుకోవచ్చు. దీనితో మీ ఆధార్ కార్డ్ విషయం లో ఏదైనా మోసం జరిగిందా అనేది తెలుస్తుంది. అయితే మరి పోర్టల్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది చూద్దాం.

ముందుగా యుఐడీఏఐ పోర్టల్ లోకి వెళ్ళండి.
ఆ తర్వాత ఆధార్ సెక్షన్ లోకి వెళ్లి ఆధార్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడ 8వ వరుస లో మీకు ఆధార్ అథెన్డిక్టేషన్ హిస్టరీ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయండి.
ఇప్పుడు ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
ఆ తర్వాత క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేయండి.
ఎప్పటినుండి హిస్టరీ కావాలి అనుకుంటున్నారో ఎంచుకుని అప్పుడు మళ్ళీ ఎంటర్ నొక్కండి.
ఆరు నెలలకు సంబంధించిన సమాచారం వస్తుంది.
ఆ తర్వాత ఓటిపి ని ఎంటర్ చేయాలి.
ఏ సమయంలో ఆధార్ ని ఎక్కడ ఉపయోగించారు వంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news