ట్రావెల్: మిమ్మల్ని అబ్బురపరిచే భారతదేశంలోని నగరాల ఇతర పేర్లు.. వాటి కారణాలు 

-

భారతదేశంలో ఉన్న వైవిధ్యమే మన దేశానికి పెద్ద ఆస్తి. ఎన్నో భాషలు, ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో సంస్కృతులు కలిసి భారతదేశాన్ని అందమైన అడవిలా మార్చేశాయి. అడవిలో ఎటు చూసినా కొత్తదనమే కనిపిస్తుంది. అలా ఉంటుంది భారతదేశం. ఐతే మన దేశంలో కొన్ని నగరాలకు వివిధ రకాల పేర్లు ఉన్నాయి. సాధారణ నామాలతో పాటు నిక్ నేమ్స్ కనిపిస్తాయి. ఐతే ఆ నిక్ నేమ్స్ రావడానికి వాటి వెనక గల కారణాలు ఆసక్తికరంగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జోధ్ పూర్- బ్లూ సిటీ

పాత జోధ్ పూర్ ప్రాంతంలో ఉండే ఇళ్ళకు రంగులన్నీ నీలిరంగులో ఉండడంతో జోధ్ పూర్ ని బ్లూ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. కొండప్రాంతం నుండి ఈ నగారాన్ని చూసినపుడు ఆకాశం నేలమీదకి వచ్చిందా అన్న ఫీలింగ్ కలుగుతుంది.

అహమ్మదాబాద్-ఇండియా మాంచెస్టర్

ఇక్కడ పత్తి ఉత్పత్తి ఎక్కువ. ఎన్నో పత్తి మిల్లులతో పాటు వస్త్ర ప్రపంచంలో అహమ్మదాబాద్ సాటిలేనిది. మాంచెస్టర్ మాదిరిగానే ఇండియాలో వస్త్ర రంగంలో ఎంతో ఉత్పత్తి సాధించే ఈ ప్రాంతాన్ని ఇండియా మాంచెస్టర్ అంటారు.

సూరత్-డైమంట్ సిటీ ఆఫ్ ఇండియా

సూరత్ లో వజ్రాల వ్యాపారం, వజ్రాల పాలిషింగ్ చాలా ఎక్కువ. ప్రపంచంలోనే వజ్రాల పాలిషింగ్, వ్యాపారాల్లో ప్రత్యేకత సాధించింది. అందుకే సూరత్ ని డైమండ్ సిటీ అంటారు.

కాన్పూర్- లెదర్ సిటీ ఆఫ్ వరల్డ్

ఇండియాలో లెదర్ ఎక్కువగా ఉత్పత్తి చేసే ప్రదేశం ఇది. ఇక్కడ నుండి దేశ విదేశాలకు లెదర్ ఎగుమతి అవుతుంది.

నాగ్ పూర్- ఆరెంజ్ సిటీ

నారింజలను ఎక్కువగా పండించే రాష్ట్రం కాబట్టి నాగ్ పూర్ ని ఆరెంజ్ సిటీ అని పిలుస్తారు. అదేకాదు  టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా నాగ్ పూర్ కి పేరుంది. టైగర్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలా పిలుస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news