ఆంధ్రాలో అదిరే హిల్ స్టేషన్స్.. ఓ ట్రిప్ వేసేస్తే సరి..!

-

మనం ఏదైనా అద్భుతమైన ప్రదేశాలుకి వెళ్లాలంటే దేశాలు దాటేయక్కర్లేదు. కేవలం మన చుట్టుపక్కల అద్భుతమైన ప్రదేశాలు ఉంటాయి వాటిని కూడా మనం ఓసారి చూసి రావచ్చు. నిజంగా ఈ హిల్ స్టేషన్స్ బాగా ఆకట్టుకుంటాయి అందమైన ప్రకృతి తో ఎంతో అద్భుతంగా ఉంటాయి.

 

పైగా అది కూడా మన ఆంధ్ర రాష్ట్రం లోనే. ఈ ప్రదేశాలను చూశారంటే ఎప్పటికీ గుర్తుండి పోతాయి. అందమైన ప్రకృతి తో వుంటే సమయమే తెలియదు కూడా. పైగా మనం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయక్కర్లేదు. మన ఆంధ్ర లోనే ఈ హిల్ స్టేషన్స్ వున్నాయి కాబట్టి తక్కువ ఖర్చుతో మనం వీటిని చూసేయొచ్చు. మరి ఆంధ్రాలో ఉండే అద్భుతమైన హిల్ స్టేషన్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

అరకు వ్యాలి:

అరకు వ్యాలీ వైజాగ్ కి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరకు అందాలను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. అరకు వెళ్లాలంటే రైలులో వెళితే బాగుంటుంది. విశాఖపట్నం నుంచి అరకు కి రైల్లో వెళితే ఎంతో బాగుంటుంది. అరకులో చూడాల్సినవి చాలా ఉన్నాయి. అరకుని ఆంధ్ర ఊటీ అని అంటారు కటికి వాటర్ ఫాల్స్, బొర్రా కేవ్స్, పద్మాపురం గార్డెన్స్ జలపాతాలు మొదలు చాలా ప్రదేశాలను చూడాల్సిందే. అరకు వెళ్లినప్పుడు కాఫీ ని మిస్ అవకండి.

లంబసింగి:

లంబసింగి కూడా ఎంతో అందమైన ప్రదేశం. దీనిని కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంటారు. అరకు కి 92 కిలోమీటర్ల దూరంలో లంబసింగి ఉంది. ఇది కూడా తప్పక చూడాల్సిన ప్రదేశం.

నల్లమల హిల్స్:

ప్రకృతి ప్రేమికులను ఈ ప్రదేశం బాగా ఆకట్టుకుంటుంది తప్పకుండా నల్లమల హిల్స్ ని కూడా చూడాల్సిందే. నల్లమల్ల వెళ్ళినప్పుడు శ్రీశైలం డ్యామ్ ని మాత్రం మిస్ అవ్వకండి.

హార్స్లీ హిల్స్:

హార్స్లీ హిల్స్ కూడా చూడాల్సిన ప్రదేశము. చక్కగా మీరు కుటుంబ సభ్యులతో కానీ ఫ్రెండ్స్ తో కానీ ఈ ట్రిప్ వేసేయచ్చు.

నాగలాపురం:

చిత్తూరు జిల్లాలో ఇది ఉంది. అందమైన చెట్లతో ఈ ప్రదేశం అంతా నిండి ఉంటుంది. వేదనారాయణ స్వామి ఆలయం, శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయం కూడా తప్పక చూడాల్సినవి.

మారేడుమిల్లి:

మారేడుమిల్లి కూడా చాలా బాగుంటుంది ఇది తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. మరి ఈ హిల్ స్టేషన్స్ కి ఓ ట్రిప్ వేసేసి మంచి జ్ఞాపకాలుగా మార్చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news