జాయింట్ సేవింగ్స్ ఖాతాకి, సేవింగ్స్‌ ఖాతాకి తేడా ఏంటి..?

-

బ్యాంకుల్లో వివిధ రకాలు అకౌంట్లు ఉంటాయి.. మనం అవసరానికి ఏదో ఒకటి తీసుకున్నాంగా అని అందరూ లైట్‌ తీసుకుంటారు.. ఒక్కో రకమైన అకౌంట్‌ వల్ల వచ్చే బెనిఫిట్స్‌ కూడా వేరుగా ఉంటాయి. జీవిత భాగస్వామితో జాయింట్‌ సేవింగ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయడం గురించి మీరు వినే ఉంటారు. అన్నదమ్ముల్లు, అక్క చెల్లెల్లు కూడా జాయింట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తుంటారు.. పొదుపు ఖాతాలను అందించే అన్ని బ్యాంకులు ఉమ్మడి ఖాతా తెరవడానికి అనుమతిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం, ఉమ్మడిగా ఖాతాను పంచుకునే ఖాతాదారుల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు. అదే సమయంలో, కొన్ని బ్యాంకులు జాయింట్ ఖాతాదారుల సంఖ్యను నలుగురికి పరిమితం చేస్తాయి. అసలు జాయింట్‌ అకౌంట్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.. జాయింట్ సేవింగ్స్ ఖాతా యొక్క ప్రయోజనాలు

జాయింట్ సేవింగ్స్ ఖాతా ప్రయోజనాలు

1) ఖాతాదారులు సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవచ్చు
2) ఇద్దరు హోల్డర్లు నిధులకు ప్రాప్యత కలిగి ఉంటారు.
3) ఉమ్మడి ఖాతాలు సాధారణంగా వ్యక్తిగత ఖాతాల కంటే ఎక్కువ వడ్డీ రేట్లు చెల్లిస్తాయి.
4) ఉమ్మడి పెట్టుబడులు, ఇతర ఆర్థిక లావాదేవీల కోసం జాయింట్ ఖాతాలను ఉపయోగించవచ్చు.
5) ఉమ్మడి ఖాతా అనేది మీ మరియు మీ కుటుంబ ఆర్థిక వ్యవహారాలను ట్రాక్ చేయడానికి సులభమైన మార్గం.
6) చాలా బ్యాంకులు జాయింట్ ఖాతాల్లో ఉన్న ప్రతి హోల్డర్‌కు డెబిట్ కార్డ్‌లు మరియు చెక్ బుక్‌లు వంటి ప్రయోజనాలను కూడా అందిస్తాయి. SBI, ICICI, HDFC, ఉజ్జీవ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యెస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, RBL బ్యాంక్, DBS, IndusInd మరియు IDFC ఫస్ట్ బ్యాంక్‌ జాయింట్ ఖాతాలను అందిస్తున్న బ్యాంకులు.

Read more RELATED
Recommended to you

Latest news