ఇక పేటీఎంలోనూ గ్యాస్ బుక్ చేసుకోవచ్చు

-

you can book gas cylinder from paytm now

అవును.. పేటీఎంలోనూ గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో పలు చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ బుకింగ్, గ్యాస్ బిల్లు చెల్లింపులు చేసుకోవడానికి పేటీఎం ద్వారా అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పటికే.. పలు కంపెనీలు తమ వినియోగదారులకు గ్యాస్ బిల్లులు, బుక్ చేయడం కోసం పేటీఎంను ఉపయోగించవచ్చని సందేశాలు పంపించాయి. పేటీఎం యాప్‌లోకి వెళ్లి.. బుక్ సిలిండర్ ఆప్షన్‌లోకి వెళ్లి.. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. గ్యాస్ బిల్లు కట్టొచ్చు. దీని కోసం కస్టమర్ తన గ్యాస్ కనెక్షన్ నెంబర్, మొబైల్ నెంబర్‌ను లింక్ చేస్తే చాలు. తద్వారా గ్యాస్ సిలిండర్ బిల్లు చెల్లింపులు, బుకింగ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. దీంతో ఆన్‌లైన్‌లోనే బుకింగ్, చెల్లింపులు చేసేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news