ఇంటర్నెట్ లేకుండా స్మార్ట్ ఫోన్ లో ఎటువంటి అప్లికేషన్స్ పని చెయ్యవు..ముఖ్యంగా గూగుల్ క్రొమ్ అనేది పని చెయ్యదు..కానీ ఇప్పుడు కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.ఇంటర్నెట్ లేకున్నా కూడా మెయిల్ ను పంపించవచ్చు..అదేలానో ఇప్పుడు చుద్దాము..1.8 బిలియన్ వినియోగదారులు ఉపయోగివున్న ఈ మెయిలింగ్ సర్వీస్ తన యూజర్ల అవసరాలను మరియు అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త ఆఫ్ లైన్ మోడ్ మెయిల్ ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫెచర్ ను మీ అకౌంట్ కు సెట్ చేసుకుంటే, ఇంటర్నెట్ లేని సమయంలో కూడా మీరు మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. గూగుల్ తన Gmail సర్వీస్ లో జత చెయ్యనున్న ఈ ఆఫ్లైన్ మోడ్ గురించి తెలుసుకోండి..
జీమెయిల్ లో గూగుల్ యాడ్ చెయ్యనున్న కొత్త ఫీచర్ తో ఆఫ్లైన్ మోడ్లో ఇమెయిల్ ను పంపే ప్రయోజనం వినియోగదారులకు అందుతుంది. అంటే, సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నెట్ లేకుండా ఇంటర్నెట్ లేకున్నా మెయిల్ పంపవచ్చు. మీ డివైజ్ ఏదైనా సరే Wifi నెట్వర్క్లో లేదా లోకల్ డేటాను లేకున్నాసేల్ ఈ ఫీచర్ ఉపయోగించి మీరు ఇమెయిల్ లను చదవవచ్చు, రిప్లై ఇవ్వవచ్చు మరియు సెర్చ్ కూడా చెయ్యవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేదా తక్కువ కనెక్టివిటీ అవకాశం ఉన్న ప్రదేశాలలో ఈ సరికొత్త వినూత్న ఫీచర్ వచ్చింది.
ఆఫ్లైన్ సర్వీస్ Google Chrome బ్రౌజర్లో మాత్రమే పని చేస్తుందని, incognito మోడ్లో పనిచేయదని Google సపోర్ట్ పేజీ పేర్కొంది. ఇక మీ డివైజ్ లో Gmail యొక్క ఆఫ్లైన్ సర్వీస్ ను ఏవిధంగా సెట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం..
ముందుగా, Google Chromeను తెరిచి, ఎగువ కుడి మూలలో ఉన్న సెట్టింగ్స్ కాగ్ ఐకాన్ ను ఉపయోగించి మీ Gmail ఖాతాను యాక్సెస్ చేయండి..ఆ తర్వాత సెట్టింగ్ మెనుని తెరవడానికి ‘See All Settings’ పై క్లిక్ చేసి అందులో ‘ఆఫ్లైన్’ ట్యాబ్కు వెళ్లండి. ఇక్కడ Gmail ఆఫ్లైన్ మోడ్ను ఆన్ చేయడానికి’Enable offline mail’ అని తెలిపే బాక్స్ ను ఎంచుకోండి. ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత, దిగువన ఉన్న ‘Save Changes button’ బటన్ను క్లిక్ చేయండి. అంతే, మీ డివైజ్ లో Gmail యొక్క ఆఫ్లైన్ సర్వీస్ ఒకే అవుతుంది..దాంతో మీరు ఎప్పుడైనా,ఎక్కడైనా ఇంటర్నెట్ లేకుండా మెయిల్ చెయొచ్చు..