వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇవాళ వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగిన విషయం తెలిసిందే కదా. ఓ యువకుడు జగన్ పై దాడి చేశాడు. ఎయిర్ పోర్ట్ లాంజ్ లో కూర్చున్న జగన్ పై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. కోళ్ల పందాలకు ఉపయోగించే కత్తితో జగన్ పై దాడికి పాల్పడ్డాడు. జగన్ లాంజ్ లో ఉండగా… సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చిన ఆ యువకుడు రెప్పపాటులో ఆ కత్తితో దాడి చేశాడు.
పైన మీరు ఫోటోలో చూస్తున్న వ్యక్తే జగన్ పై దాడి చేసిన వ్యక్తి. అతడి పేరు శ్రీనివాస్. అతడిది తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మడిచెరువు మండలం తానిలంక గ్రామం అని పోలీసులు చెబుతున్నారు. అతడు ఎయిర్ పోర్ట్ లోని ఓ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇక.. వైఎస్ జగన్ ప్రమాదం నుంచి బయట పడ్డారు. వెంటనే హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. తనపై జరిగిన దాడి గురించి అభిమానులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జగన్ కోరారు. నేను క్షేమంగా ఉన్నా. ప్రజల ప్రేమానురాగాలు, ఆశీర్వాదంతో నేను సురక్షితంగా ఉన్నా. ఇటువంటి పిరికిపంద దాడులతో నన్ను ఏం చేయలేరు. ఎన్ని కుట్రలు చేసినా నా ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరు.. అని జగన్ ట్వీట్ చేశారు.
To everyone worried about my safety – I’d like to inform you that I am safe. God's grace and the love, concern & blessings of the people of Andhra Pradesh will protect me. Such cowardice acts will not dissuade me but only strengthen my resolve to work for the people of my state!
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 25, 2018