ఏ.పి.సిఎం జగన్ మోహన్ రెడ్డి ని కలవనున్న మెగాస్టార్ చిరంజీవి ..ఎందుకో తెలుసా ..?

-

మెగా స్టార్ చిరంజీవి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ల అధ్యక్షతన ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకి అనుమతిని కోరుతు సమావేశం అయిన సంగతి తెలిసిందే. అలాగే వీరంతా తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఅర్ ని కలిసి సంస్యలు వివరించగా ఆయన్ సానుకూలంగా స్పందించి షూటింగులకి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు.

 

ఇక తాజాగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను అభినందించారు. ఇక చిత్ర పరిశ్రమకు మేలు చేకూర్చే సింగిల్ విండో విధానం ప్రవేశ పెడుతూ జి ఓ జారీ చేసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కి చిరంజీవి ఫోన్ చేసి ప్రతేకంగా కృతఙ్ఞతలు తెలిపారు. అంతేకాదు చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చించేందుకు లాక్ డౌన్ ముగిశాక జగన్ ని కలువబోతున్నట్లు చిరంజీవి తన ట్వీట్టర్ ద్వారా తెలిపారు.

విశాఖ వేదికగా చిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చిరంజీవి చేసిన తాజా ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. ఇక కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు చిరంజీవి అధ్యక్షతన చిత్ర ప్రముఖులు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. సిసిసి ద్వారా ఇప్పటికే దాదాపు 14 వేల కుటుంబాలను ఆదుకొని గత రెండు నెలలుగా వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు సమకూర్చారు చిరు బృందం.

Read more RELATED
Recommended to you

Latest news