లోకేష్ బరువు సీక్రెట్ చెప్పిన కొడాలి నాని!

-

చంద్రబాబు – లోకేష్ ల పేరు చెబితే ఒంటికాలిపై లేచే వైకాపా నాయకుల్లో ఫస్ట్ ప్లేస్ కొడాలి నానీకే అన్నా అతిశయోక్తి కాదేమో! ఇది కేవలం ప్రత్యర్థి రాజకీయ నాయకులపై చేసే విమర్శలు కాదు.. అంతకు మించిన బాద నాని మనసులో ఏదో ఉంది, దానికి ప్రాధాన కారణం బాబే అవ్వడం వల్లే.. అవకాశం రావడం ఆలస్యం, బాబు పై నాని నిప్పూలు చెరిగేస్తుంటారు అని పలువురు అభిప్రాయపడుతుంటారు. ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా జిం చేశాను, డైటింగ్ చేశాను, ఫలితంగా బరువు తగ్గాను… అందుకే పసుపు చొక్కాలన్నీ లూజైపోవడం వల్ల ఈ సారి మహానాడుకు తెలుపు చొక్కా చేసుకొచ్చానని లోకేష్ తెలిపిన సంగతి తెలిసిందే. సరిగ్గా వీటిపైనే నాని తనదైన శైలిలో స్పందించారు!

లాక్‌డౌన్‌ కాలంలో 20 కేజీలు తగ్గానని మహానాడులో లోకేష్‌ చెప్పుకున్నాడు. పిజ్జాలు, బర్గర్‌లు, ఐస్‌క్రీంలు లేక తగ్గినట్టు ఉన్నాడు అని నాని అభిప్రాయపడ్డారు! ఆ సంగతులు అలా ఉంటే… ప్రతిసారీ ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు – లోకేష్ లు వీడాలని, వారికి దీర్యం ఉంటే సీబీఎన్ టీడీపీ అని మరో పార్టీ స్థాపించాలని డిమాండ్ చేసే నాని… ఈసారి కూడా అదే విషయాన్ని ప్రస్థావించారు! చంద్రబాబుకు సిగ్గు, శరం ఉంటే ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆయన కుమారులకు వదిలేసి.. దమ్ము, ధైర్యం ఉంటే తనయుడు లోకేష్‌ తో “సీబీఎన్‌ టీడీపీ” అని ఒకపార్టీని స్థాపించి 2024 ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. అనంతరం ఇంకాస్త వాయిస్ పెంచిన నాని… కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని చవట దద్దమ్మ నారా లోకేష్‌ కు జగన్ ను విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు.

ఇక తాజాగా రైతులను జగన్ మోసం చేశారంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించిన నాని… రూ.87వేల కోట్ల రైతు రుణాలు రద్దు చేస్తానని, హైటెక్‌ నుండి రైతు పక్షపాతినయ్యానంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు… కేవలం రూ. 12వేల కోట్లను మాత్రమే రుణమాఫీ చేసి రైతులను వెన్నుపోటు పొడవడమే కాకుండా… అంతే చేయగలను అన్నట్లుగా చేతులు దులుపుకున్న చవట దద్దమ్మ అని వ్యాఖ్యానించారు!

పిల్లనిచ్చిన మామను, అన్నం పెట్టే రైతును మోసం చేయగల్గిన చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారతాడనే విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమైందని అభ్హిప్రాయపడిన నాని… గత ఎన్నికలకు ముందు రైతులకు రూ.12,500లు చొప్పున నాలుగేళ్ల పాటు రైతు భరోసాగా ఇస్తానని జగన్‌ ప్రకటించారని, కానీ ప్రస్తుతం దాన్ని రూ.13,500 పెంచి ఇస్తూ వస్తున్నామని, రైతులను మోసం చేసే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని, రాదని నాని తేల్చి చెప్పారు!

Read more RELATED
Recommended to you

Latest news