దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) ఆత్మహత్య కేసులో నిన్నటి నుంచి ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రధాని మోడీ సహా ఎందరో రాజకీయ, సినీ, సామాజిక ప్రముఖులు ఎందరో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియట్లేదు. ఈ నేపధ్యంలో సుశాంత్ సింగ్ మామ పిడుగులాంటి వార్తా పేల్చారు. సుశాంత్ మృతి వెనుక అనేక అనుమానాలున్నాయని, వెంటనే న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన… సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతని మృతి వెనుక ఏదో కుట్ర ఉండవచ్చన్నారు. సుశాంత్‌ది ముమ్మాటికి హత్యే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటి చుట్టుపక్కల ఉండే వారిని విచారిస్తున్నారు.
సుశాంత్ ది ఆత్మహత్య కాదు.. హత్యే..?
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఓరుగల్లు ప్రజలకు రేవంత్ క్షమాపణలు చెప్పాలి – ఏనుగుల రాకేష్ రెడ్డి
ఓరుగల్లు ప్రజలకు రేవంత్ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్...
T20WC 2024: విజేత, రన్నరప్‌ల ప్రైజ్ మనీ ఎంతంటే.?
టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ - దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. అయితే ఇందులో...
అధిక రక్తపోటును నియంత్రించడానికి నివారించాల్సిన ఆహారాలు..
అధిక రక్తపోటుతో నేడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అధిక రక్తపోటు...