ఏపీ ప్రభుత్వం టీడీపీ నేతనలు అక్రమ అరెస్టులు చేస్తుందని.. కాబట్టి టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంతా నిరసనలూ, ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు! ఆ మాటకు చింతమనేని లాంటి వారు కాస్త అతిగా స్పందించగా, మరికొందరు నేతలు ఓ మొస్తారుగా స్పందించారు. జనాల్లో అయితే స్పందన పెద్దగా కనిపించలేదు. ఆ సంగతులు అలా ఉంటే… ఓ ముగ్గురు మాజీ మంత్రులు మాత్రం అస్సలు కనిపించలేదు. బాబు చెప్పింది మాకు కాదు అనుకున్నారో, జగన్ టెబుల్ పై ఉన్న మా ఫైళ్ల టెన్షన్ లో మేముంటే.. ఈ ధర్నాలూ దీక్షలు ఏమిటని అనుకున్నారో తెలియదు కానీ… లైట్ తీసుకున్నారు. వారెవరు.. ఏయే విషయాల్లో వారు నెక్స్ట్ టార్గెట్ లో ఉన్నారు అనేది ఇప్పుడు చూద్దాం!
చట్టం తనపని తాను చేసుకుపోతుంది అంటూ… ఏపీ సర్కార్ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఉక్కుపాదం మోప నిర్ణయించుకుంది! అనుకున్నదే తడవుగా బాబు పాలనపై సీబీఐ కేసులు వేయడంతో పాటు… అవినీతికి పాల్పడ్డారని అచ్చెన్నను, అక్రమాలు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేసిన అనంతరం మరో ముగ్గురు మంత్రుల లిస్ట్ ఇదేనంటూ… దానికి గల కారణాలపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది! నెక్స్ట్ ఏసీబీ వెళ్లి తలుపు తట్టేది ఈ ముగ్గురు మంత్రుల ఇళ్లనే అని అంటున్నారు!!
వారిలో ఒకరు గంటా శ్రీనివాస రావు కాగా, రెండోవారు నారాయణ కాగా.. మూడో వ్యక్తి ప్రత్తిపాటి పుల్లారావు! జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో నాడు-నేడు ఒకటి! అయితే గత ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాస రావు శాఖలో ప్రాథమికోన్నత పాఠశాలలకు రంగులు కార్యక్రమంలో అవినీతి తీవ్రంగా జరిగిందని తెలుస్తుందట! అరాకొరా పాఠశాలలకు రంగౌలు వేసినా… అవి వెలిసిపోవడంతో అసలు ఏం జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నారట. దీంతో గంటా శ్రీనివాస రావు ఆ విధంగా చిక్కుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక రెండో పేరు.. మాజీ మంత్రి పొంగూరు నారాయణ! సీఆర్డీఏ భూములు, అమరావతి కంపెనీల విషయంలోనూ, భూముల విషయంలోనూ నారాయణ పాత్ర పుష్కలంగా ఉందని వైకాపా నేతలు నమ్ముతున్నారు. కాబట్టి… నెక్స్ట్ కచ్చితంగా ఈయనే ఉంటారని అంటున్నారు. ఇదే క్రమంలో… నకిలీ పురుగు మందుల దుకాణాలను ప్రోత్సహించి, తద్వారా విపరీతంగా అవినీతికి పాల్పడ్డారాని ప్రత్తిపాటి పుల్లారావుపై ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే… ప్రతీపాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మ తో పాటు ఆయన కుమారుడిపై కూడా ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి! కాబట్టి… ఈ ముగ్గురు మాజీ మంత్రులూ నెక్స్ట్ లిస్ట్ లో ముందు వరుసలో ఉన్నారని అంటున్నారు!!
ఈ విషయాలపై వీరికి కూడా లీకులు ఉండటంవల్లో.. లేక, మీడియాలో వస్తున్న వార్తలు చూడటం వల్లో వీరి టెన్షన్స్ లో వీరు ఉంటే… బాబు మాత్రం ధర్నాలు, దీక్షలు చేయాలని అంటే… వీరు మాత్రం బాబు మాట ఎలా వింటారు? రేపు వీరికోసం ఎవరైన ధర్నాలు చేస్తే బాగుండు అనుకోవడం తప్ప!!