నేడు హైదరాబాద్‌లో కేంద్ర బృందం పర్యటన..!

-

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ మహమ్మారి తీవ్ర అధికంగా ఉంది. రోజురోజుకు అధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రమాదం ఉందని భావించింది కేంద్రం.. వెంటనే కేంద్ర బృందాన్ని తెలంగాణకు పంపింది. ఈ బృందం ఇవాళ ఉదయం హైదరాబాద్‌ లోని కట్టడి ప్రాంతం పరిధిలోని దోమల్‌గూడలో ఉన్న ధోబీగల్లీని సందర్శించనున్నారు.

 

అలాగే… వేర్వేరు ఆస్పత్రుల్లో ఉన్న ల్యాబుల్ని చెక్ చేస్తుంది. అక్కడ బ్లడ్ శాంపిల్స్ ఎలా తీసుకుంటున్నారు? వాటిని ల్యాబ్‌కి ఎలా పంపిస్తున్నారు? రిజల్ట్స్ ఎంత సేపటిలోగా ఇస్తున్నారు? ఆస్పత్రుల్లో సదుపాయాలు ఎలా ఉంటున్నాయి? ఇవన్నీ కేంద్ర బృందం చూడనుంది. అనంతరం బీఆర్కే భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కారదర్శితో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి వెళ్లనున్నారు. అక్కడి నుంచి గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించనున్నారు. ఇందుకోసం లవ్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని బృందం ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news