ఆంధ్రప్రదేశ్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా.. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 765 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 12 మంది కరోనా వల్ల మరణించారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,699కి చేరింది. కరోనా మరణాల సంఖ్య 218కి పెరిగింది. ఇప్పటి వరకూ ఏపీలో 8,008 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9473 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.