నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ బంపర్ ఆఫర్..!

-

తెలంగాణలోని నిరుద్యోగ యువతకి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన.. దాని అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించే సిబ్బందిని భర్తీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. అలాగే అభివృద్ధి ప్రణాళికపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి సమీక్షా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని..

అలాగే ఎంతో బాగా అభివృద్ధి చెందిన సిద్ధిపేట మున్సిపాలిటీని రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పాత బస్సులను తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా 400 షీ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణను మొక్కుబడిగా కాకుండా కొత్త ఒరవడితో సేకరించాలని, మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ఉదయం 5.30 గంటల నుంచి వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగానే మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news