సచివాలయం కూల్చివేత.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట..!

-

సచివాలయం కూల్చివేతపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సచివాలయ కూల్చివేత అంశంపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం కార్యాలయం.. సచివాలయ నిర్మాణాన్నిఅడ్డుకోవాలనుకుంటున్న వారికి ఇంది చెంపపెట్టని పేర్కొంది. కాగా ఇప్పటికే భవనాల కూల్చివేతలపై హైకోర్టులో విచారణ జరుగుతోంది.

తాము చెప్పే వరకు కూల్చివేతలు ఆపాలని స్పష్టం చేసింది. పర్యావరణానికి నష్టం కలుగుతుందంటూ వేసిన పిటిషన్‌పై అభిప్రాయాలను తెలుసుకుంటోంది. ఇకపోతే రూ.500 కోట్ల వ్యయంతో నూతన సచివాలయ భవనాన్ని నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. శ్రావణ మాసంలో నిర్మాణ పనులను ప్రారంభించే యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news