బిగ్ బాస్ ఏం ఇచ్చింది బాసు

-

తెలుగు బిగ్ బాస్ రెండు సీజన్స్ పూర్తి చేసుకోగా మొదటి సీజన్ విన్నర్ గా శివ బాలాజి, రెండవ సీజన్ విన్నర్ కౌశల్ మంద నిలిచారు. విన్నర్ గా నిలిచిన వారు కూడా ఏమంత ప్రభావం చూపించలేదు. శివ బాలాజి విన్నర్ అయిన తర్వాత వచ్చిన స్నేహమేరా జీవితం ఫ్లాప్ అయ్యింది. ఇక సెకండ్ సీజన్ విన్నర్ కౌశల్ కాస్త క్రేజ్ తెచ్చుకున్నా అది తన కెరియర్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

what contestants got from bigg boss

ఇక బిగ్ బాస్ సీజన్ 1 లో పాటిస్పేట్ చేసిన కంటెస్టంట్స్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. కేవలం హరితేజ ఒక్కతే కాస్త కూస్తో అవకాశాలను అందుకుంటుంది. బిగ్ బాస్ సీజన్ లో ఫైర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న తనీష్ కూడా షోలో ఓ రెచ్చిపోయినా బయట మాత్రం ఎప్పటిలానే అతని సినిమాల పరిస్థితి ఉందని చెప్పొచ్చు.

what contestants got from bigg boss

తనీష్ హీరోగా వచ్చిన దేశ దిమ్మరి సినిమా శుక్రవారం రిలీజైంది. అసలు ఈ సినిమా వచ్చింది అన్నది ఎవరికి తెలియదు. బిగ్ బాస్ వల్ల రెమ్యునరేషన్ వచ్చిందని ఆనందించడం తప్ప కెరియర్ విషయంలో మాత్రం ఏమంత ఉపయకరంగా లేదని అనిపిస్తుంది. బిగ్ బాస్ 2 నుండి వచ్చిన తేజశ్వి, భాను శ్రీనులు ఒకటి రెండు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. విన్నర్ కౌశల్ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. సో బిగ్ బాస్ షో నడుస్తున్నప్పుడు ఉన్న క్రేజ్ బయటకు వచ్చాక మాత్రం లేదని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news