ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం కరోనా మహమ్మారితో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో కొన్నిరోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రెగ్యులర్ ట్రీట్‌మెంట్‌కి కరోనా నయం కాకపోవడంతో చివరి ప్రయత్నంగా ప్లాస్మా ద్వారా వైద్యం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే బాలసుబ్రహ్యణ్యం క్షేమంగా తిరిగిరావాలంటూ సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వీడియో సందేశం రిలీజ్ చేశారు.
Get well soon dear Balu sir pic.twitter.com/6Gxmo0tVgS
— Rajinikanth (@rajinikanth) August 17, 2020
‘ప్రియమైన బాలు సర్, మీరు త్వరగా కోలుకోవాలి’ అంటూ ఆయన ఆకాంక్షించారు.ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నానని రజనీకాంత్ తెలిపారు. కాగా, ఇప్పటికే ఇళయరాజా, కమల్‌హాసన్, చిరంజీవి, ఖుష్బూ, పవన్ కళ్యాణ్ సహా పలువురు సినీ సెలబ్రిటీలు బాలసుబ్రహ్యణ్యం కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.