మోదీ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి : సిపిఐ రామ‌కృష్ణ‌

-

CPI Ramakrishna comments On Modi

విజయవాడ : పెద్దనోట్ల రద్దు చేసి రెండేళ్లు గడిచినా ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ విమర్శించారు. 130 కోట్ల మంది భారతీయులను నడిరోడ్డుపై నిలబెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ తీసుకున్న నోట్ల రద్దు విఫల ప్రయోగంగా వర్ణించారు. బ్లాక్‌ మనీ, తీవ్రవాదం అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేశామని మోదీ గతంలో చెప్పారని.. ఇప్పుడు ఎలాంటి ఫలితాలు సాధించారో ప్రజలు తెలపాలని ఆయన డిమాండ్‌. నోట్ల రద్దు తరువాత కశ్మీర్‌లో తీవ్రవాదం మరింత పెరిందన్నారు. దేశంలో అనేక చోట్ల పరిశ్రమలు మూతపడ్డాయని ఆయన మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news