ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రత్యక్షమయ్యారు. ఆయన కోమాలో ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించిందని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా విడుదైలన ఫొటోలతో ఇదంతా అసత్య ప్రచారమని రుజువవుతోంది. టైఫూన్ బవి తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించారు కిమ్. ఈ సందర్శనకు సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా మీడియా విడుదల చేసింది. అయితే ఆయన ఎప్పుడు పర్యటించారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఫొటోలను గమనిస్తే బహుశా గురువారం మధ్యాహ్నం ఆయన సందర్శన జరిగి ఉంటుందని తెలుస్తోంది.టైఫూన్ బవి తుపాను కారణంగా ఉత్తరకొరియాలో వరదలు సంభవించి తీవ్రనష్టం వాటిల్లింది. దక్షిణ హవాంఘే రాష్ట్రంలో గురువారం కొండచరియలు విరిగిపడ్డాయి.
గత కొద్ది రోజులు క్రితం స్థానిక మీడియా ఈ విధంగా కిం కోమా లో ఉన్నట్లు కథనం ఇచ్చింది. కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నట్లు దక్షిణ కొరియా అధికారి ఒకరు వెల్లడించారు. తన సోదరి కిమ్ యోంగ్ ఉన్‌కు కొన్ని అధికారాలు కట్టబెట్టిన అనంతరం ఆయన ఆరోగ్యం విషమించినట్లు పేర్కొన్నారు. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డై జంగ్ సహచరుడే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు వెల్లువెత్తాయి. తీవ్రంగా జబ్బుపడి మరణించారన్న కథనాలు కూడా వచ్చాయి.