ఐపీఎల్ అఫిషియ‌ల్ పార్ట్‌న‌ర్‌గా అన్అకాడ‌మీ.. వెల్ల‌డించిన బీసీసీఐ…

-

బెంగళూరుకు చెందిన ఎడ్యు-టెక్ సంస్థ అన్అకాడ‌మీ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)కు అఫిషియ‌ల్ పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది. ఈ మేర‌కు శ‌నివారం బీసీసీఐ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 2020 నుంచి 2022 వ‌ర‌కు మొత్తం 3 సీజ‌న్ల‌కు గాను అన్అకాడ‌మీ ఐపీఎల్ అఫిషియ‌ల్ పార్ట్ న‌ర్‌గా కొన‌సాగ‌నుంది. కాగా ఇప్ప‌టికే ఐపీఎల్ 13వ ఎడిష‌న్ టైటిల్ స్పాన్స‌ర్‌గా డ్రీమ్ 11 హ‌క్కులు పొంద‌గా.. ఇప్పుడు అఫిషియ‌ల్ పార్ట్ న‌ర్‌గా అన్అకాడ‌మీ కొన‌సాగ‌నుంది.

unacademy became official partner for ipl from 2020 to 2022

ఈ సంద‌ర్బంగా ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేష్ ప‌టేల్ మాట్లాడుతూ.. అన్అకాడ‌మీ ఐపీఎల్ అఫిషియ‌ల్ పార్ట్‌న‌ర్ అయినందుకు సంతోషంగా ఉంద‌న్నారు. 2020 నుంచి 2022 వ‌ర‌కు అన్అకాడ‌మీ ఐపీఎల్ అఫిషియ‌ల్ పార్ట్‌న‌ర్‌గా ఉంటుంద‌న్నారు. ఇక అన్అకాడ‌మీ ఇలా కొన‌సాగ‌డం వ‌ల్ల దేశంలోని ఎంతో యువ‌త ఐపీఎల్‌కు ద‌గ్గ‌ర‌వుతార‌న్నారు. అలాగే ఎంతో మందికి అన్అకాడ‌మీ కెరీర్ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంద‌ని తెలిపారు.

అన్అకాడ‌మీ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ క‌ర‌న్ ష్రాఫ్ మాట్లాడుతూ ఐపీఎల్‌కు అపిషియ‌ల్ పార్ట్‌న‌ర్ అయినందుకు ఆనందంగా ఉంద‌న్నారు. విద్యారంగంలో అన్అకాడ‌మీ అద్భుత‌మైన సాంకేతిక ప‌రిజ్ఞానంతో విద్యార్థులు త‌మ కెరీర్ లో ముందుకు దూసుకువెళ్లేలా అనేక అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news