రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా అమర్ అక్బర్ ఆంటొని. గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ ట్రిపుల్ రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు. ట్రిపుల్ రోల్స్ లో కనిపిస్తాడా.. లేక ట్రిపుల్ క్యారక్టర్స్ లో ఒక్కడే మారుతాడా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 16 న రిలీజ్ కానుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమెడియన్ కమ్ హీరో సునిల్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇటీవలే సినిమా టీజర్ ను రిలీజ్ చేసిన చిత్ర బృందం ఇవాళ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది.