ఇవాళ రాత్రి తెలంగాణ కేబినెట్‌ సమావేశం..!

-

నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో రాత్రి 7.30  గంటలకు జరగనున్న కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ముఖ్యంగా కొత్తగా రూపొందించిన రెవెన్యూ చట్టాలతో పాటు శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన ఇతర బిల్లులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. అసెంబ్లీ, మండలిలో మంత్రుల బాధ్యతలపై సీఎం కేసీఆర్‌ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

అలాగే ఇవాల్టి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడం.. అదే రోజు రాత్రి కేబినెట్ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం సమావేశం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news