జ‌గ‌న్ వెంట న‌డిచేవారికి ఐడి కార్డులు.. సెల్ఫీల‌కు ఫుల్‌స్టాప్‌!

-

No selfies with jagan from now
జ‌గ‌గ్‌న్ కు ప‌టిష్ట బందోబ‌స్తు
క‌ల‌వాలంటే కూడా గుర్తింపు త‌ప్ప‌నిస‌రి

విజయవాడ: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ప్రతిపక్ష నేత జగన్‌పై కోడికత్తితో దాడి ఘటనపై ప్రభుత్వం స్పదించింది. ఆయనకు పటిష్ట భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడంచల భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించింది. రెడ్, గ్రీన్, బ్లూ ఐడీ కార్డులను పోలీసులు జారీ చేశారు. జగన్‌ను అనుసరిస్తున్న నేతలకు రెడ్ ఐడీ కార్డులు ఇచ్చారు. జగన్‌ను కలిసే వారికి గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. వీఐపీలకు ఎర్రరంగు గుర్తింపు కార్డు, జగన్‌తో పాటు ప్రజా సంకల్పయాత్రను అనుసరిస్తున్న వారికి నీలం రంగు గుర్తింపు కార్డు, పాదయాత్రలో సిబ్బందికి ఆకుపచ్చ గుర్తింపుకార్డు ఇవ్వనున్నారు. ఇకపై ప్రజలు, కార్యకర్తలు జగన్‌ను కలవాలన్నా, మాట్లాడాలన్నా ఆ భద్రతా వలయం బయటినుంచే మాట్లాడాల్సి వస్తుందని పోలీసులు చెప్తున్నారు. ఇకపై 50 మంది పోలీసులతో రోప్‌ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సెల్ఫీల విషయంలోనూ ఆంక్షలు పెట్టనున్నారు. సీఆర్పీఎఫ్‌ పోలీసులు పాదయాత్ర మార్గంలో ముందుగానే తనిఖీలు చేస్తారు. రోడ్‌ క్లియరెన్స్‌ పార్టీని ఏర్పాటు చేశారు. పాదయాత్రలో నిఘాకు డ్రోన్‌ కెమెరాలను వినియోగించనున్నారు. వీటితోపాటు బాడీవేర్‌ కెమెరాలను వినియోగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news