కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (11-09-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో శుక్ర‌వారం (11-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 11th september 2020

1. ఏపీలో కొత్త‌గా 9,999 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,47,686కు చేరుకుంది. 96,191 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4,46,716 మంది కోలుకున్నారు. 4,779 మంది చ‌నిపోయారు.

2. సోష‌ల్ డిస్ట‌న్సింగ్‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తే క‌రోనాను అదుపు చేయ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు తెలిపారు. ఈ మేర‌కు జాన్స్ హాప్‌కిన్స్ బ్లూమ్‌బ‌ర్గ్ స్కూల్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్‌కు చెందిన ప‌లువురు సైంటిస్టులు ఓ అధ్య‌య‌నం చేప‌ట్టి ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

3. దేశంలో కొత్త‌గా 96,551 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 45,62,415కు చేరుకుంది. 9,43,480 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 35,42,663 మంది కోలుకున్నారు. 76,271 మంది చ‌నిపోయారు.

4. తెలంగాణలో కొత్త‌గా 2,426 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,52,602కు చేరుకుంది. 940 మంది చ‌నిపోయారు. 1,19,467 మంది కోలుకున్నారు. 32,195 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

5. క‌ర్ణాట‌క‌లో కొత్త‌గా 9,464 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,40,411 కు చేరుకుంది. 3,34,999 మంది కోలుకున్నారు. 98,326 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 7,067 మంది చ‌నిపోయారు.

6. దేశీయ ఫార్మా సంస్థ భారత్ బ‌యోటెక్ తాను రూపొందించిన కోవ్యాక్సిన్‌ను జంతువుల‌పై ప్ర‌యోగించ‌గా.. అందులో స‌త్ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని తెలిపింది. మొద‌టి డోస్ వ‌ల్ల జంతువుల ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో వైర‌స్ వృద్ధిని నియంత్రించామ‌ని తెలిపింది.

7. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 7,103 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,99,045 కు చేరుకుంది. 4,282 మంది చ‌నిపోయారు.

8. ఢిల్లీలో కొత్త‌గా 4,266 కరోనా కేసులు నమోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,09,748కు చేరుకుంది. 1,78,154 మంది కోలుకున్నారు. 4,687 మంది చ‌నిపోయారు. 26,907 యాక్టివ్ కేసులున్నాయి.

9. భార‌త్‌లో ప్ర‌స్తుతం 45 ల‌క్ష‌ల క‌రోనా కేసులు ఉండ‌గా.. అమెరికాలో 65 ల‌క్ష‌ల కేసులు ఉన్నాయి. ఈ క్ర‌మంలో భార‌త్ క‌రోనా కేసుల్లో అమెరికాను దాటి మొద‌టి స్థానంలో నిలుస్తుంద‌ని సైంటిస్టులు చెప్పారు. అక్టోబ‌ర్ మొద‌టి వారం వ‌రకు భార‌త్‌లో 70 ల‌క్ష‌ల కేసులు ఉంటాయ‌న్నారు.

10. కేంద్ర ప్ర‌భుత్వం ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాపై ఎలాంటి ప‌రిమితులు విధించ‌రాద‌ని స్ప‌ష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news