ఒక రథం – మూడు పార్టీలు… జగన్ షాకింగ్ డెసిషన్!!

-

తూర్పుగోదావ‌రి జిల్లా, సఖినేటిపల్లి మండలం అంత‌ర్వేదిలో శ్రీ‌ల‌క్ష్మి న‌ర‌సింహ‌స్వామి ఆల‌యంలో స్వామివారి ర‌థం ద‌గ్ధ‌మైన సంగతి తెలిసిందే. సుమారు 60 ఏళ్ల క్రితం టేకుతో త‌యారు చేయించిన ఈ ర‌థం 40 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎంతో ప‌విత్రంగా భావించే ఈ ర‌థం అగ్నికి ఆహుతి కావ‌డం ప్ర‌తి ఒక్క‌ర్నీ క‌ల‌చివేసింది! అయితే… ప్రస్తుతం ఈ రథం జ్వాలల్లో రాజకీయ మార్గాలు వెతుక్కుంటున్నాయి ప్రతిపక్షాలు!!

అవును… అంతర్వేదిలో జరిగిన ఘటన ఎవరూ సమర్ధించలేనిది! అత్యంత దారుణమైన ఈ ఘటన విషయంలో టీడీపీ పూర్తిగా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనలు చేస్తోన్న సంగతి తెలిసిందే! ఇంత‌కాలంలో మ‌త‌ప‌ర‌మైన రాజ‌కీయాలు అంటే టక్కున గుర్తొచ్చే బీజేపీతో నేడు టీడీపీ పోటీపడుతుందా అన్న రేంజ్ లో తమ్ముళ్లు హడావిడి చేస్తున్నారు!! నిన్న మొన్న‌టి వ‌ర‌కు “చేగువేరా” పేరు చెప్పి కలరింగ్స్ ఇచ్చిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌ క‌ల్యాణ్ కూడా… బీజేపీ వాసనల ప్రభావమో లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎంచుకున్న మార్గమో కానీ… అత్యంత ఇబ్బందికర ప్రసంగాలు చేస్తున్నారు!!

ఇక అస‌లు రాష్ట్రంలో సీబీఐ అడుగు పెట్ట‌డానికి వీల్లేద‌న్న అల్టిమేటం జారీచేసిన చంద్రబాబు… అంత‌ర్వేది ఘ‌ట‌న‌పై సీబీఐ తో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేస్తున్నారు! ఇదే సమయంలో బీజేపీ – జనసేనలు కూడా ఇదే డిమాండ్ బలంగా చెబుతున్నాయి. ఈ విషయంలో ఏమాత్రం సెకండ్ థాట్ కి వెళ్ళని జగన్… జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షాల ఎత్తుల‌ను, కుట్ర‌ల‌ను చిత్తు చేస్తూ సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఆదేశించారు!! దీంతో… ఈ సమస్యపై రాజకీయ చలిమంటలు కాసుకోవాలని భావించిన వారి ఆశలు అడియాశలయ్యాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news