కరోనా వ్యాక్సిన్ పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆరోగ్య మంత్రి..

-

రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. న్యూస్ ఛానెళ్ళలో ఇదిగో వస్తోంది, వచ్చేస్తోంది వంటి వార్తలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఐతే తాజాగా కరోనా వ్యాక్సిన్ పై కేంద్ర ఆరోగ్యమంత్రి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. కేంద్ర ఆరోగ్యమంత్రి మాట్లాడుతూ, కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో సరైన తేదీ నిర్ణయించలేమని, కాకపోతే వచ్చే సంవత్సరం మొదటి త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఈ వ్యాక్సన్ ని మనుషులపై ప్రయోగించే క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ వచ్చాక జనాల్లో అంతగా నమ్మకం లేకపోతే తానే మొదటి డోస్ తీసుకుంటానని వెల్లడించారు. మొత్తానికి ప్రభుత్వం నుండి కరోనా వ్యాక్సిన్ పై క్లారిటీ వచ్చేసినట్టే.

క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తే ముందుగా రిస్క్ ఎక్కువ‌గా ఉన్న‌వారికి, అత్య‌వ‌స‌ర సేవ‌లు అందించే వారికి వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తామ‌ని తెలిపారు. అత్య‌వ‌స‌ర సేవ‌లు అందించేవారితోపాటు వృద్ధులు, పిల్ల‌లు, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి ముందుగా వ్యాక్సిన్‌ను పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ క్ర‌మంలో వ్యాక్సిన్ సేఫ్టీ, ఖ‌రీదు, స‌ప్లై చెయిన్ వంటి అంశాల‌ను కేంద్రం ముందుగా ప‌రిశీలించి అంచ‌నా వేస్తుంద‌ని, అందుకు అనుగుణంగా దేశంలోని ప్ర‌జలంద‌రికీ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తామ‌ని తెలిపారు.

కోవిడ్ వ్యాక్సిన్ సేఫ్ అని నిరూపించేందుకు అవ‌స‌రం అయితే తాను ముందుగా వ్యాక్సిన్ తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలో ప్ర‌స్తుతం 3 వ్యాక్సిన్లు ఫేజ్ 2, 3 ట్ర‌య‌ల్స్‌లో ఉన్నాయ‌ని, వాటిలో ఏది ముందుగా అందుబాటులోకి వ‌స్తుందో చెప్ప‌లేమ‌ని అన్నారు. ఏ వ్యాక్సిన్ వ‌చ్చినా స‌రే.. ప్ర‌జ‌లంద‌రికీ పంపిణీ చేస్తామ‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news