దిగజారిపోయిన బండారు… జగన్ ముఖ్యమంత్రి సారు!

-

ప్రస్తుతం ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలకు విమర్శలు చేసే అవకాశాలు కూడా దొరకకుండా జగన్ పాలన సాగిస్తున్నారనే కామెంట్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి! నిజంగా ఆలోచించినా కూడా ప్రజల తరుపున సమస్యలు ఉత్పన్నం కాకుండా.. ప్రతిపక్షాలకు విమర్శలు చేసే అవకాశాలు లేకుండా జగన్ పాలన సాగిస్తున్నారు. దీంతో జగన్ పై కేవలం వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. వారి వారి మనుగడ కాపాడుకునేపనిలో ఉన్నారు టీడీపీ నేతలు!

జగన్ బెయిల్ పై వచ్చి తిరుగుతున్న వ్యక్తి.. అందుకు ఆయన కేంద్ర హోంమంత్రిని వ్యక్తిగతంగా కలవడం ఏమిటి? అలా కలవకూడదు! జగన్ ‌పై ఉన్న కేసుల ఉచ్చు బిగుస్తున్నందునే కేంద్ర పెద్దలను కలిసినట్లున్నారు అంటూ మొదలుపెట్టారు టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి! దీంతో బండారు నిద్రనుంచి మేల్కోవాలని కోరుకుంటున్నారు తమ్ముళ్లు!

కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుని కబుర్లు చెప్పే బాబు లాంటి వ్యక్తులు అయినా.. మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి పనులకు సంబందించిన కేసులో బెయిల్ పై బయటకు వచ్చి నేడో రేపో పార్టీ అధ్యక్షుడు అయ్యే అచ్చెన్నాయుడు అయినా.. ఎవరైనా కానీ తమ హోదాకు తగ్గట్లుగా నడుచుకుంటారే తప్ప.. గతంలో బెయిల్ తీసుకున్నాను కదా అని రాష్ట్రాన్ని గాలికి వదిలేసి.. కరోనాకు బయపడి దాక్కొన్న బాబులాగా.. జగన్ కూడా ఉండాలా? అని ప్రశ్నిస్తున్నారు వైకాపా నేతలు!

సరే వారన్నారు వీరన్నారు అని కాదు కానీ…. వైఎస్ జగన్ అనే వ్యక్తి బెయిల్ పై ఉన్నప్పటికీ.. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అత్యంత భారీగా ప్రజాధరణ పొంది, ప్రతిపక్షాల మనుగడను ప్రశ్నార్ధకంచేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్న నాయకుడు. ప్రధాని సైతం అభినందించేస్థాయిలో కరోనా సమయంలో పాలన సాగిస్తోన్న ముఖ్యమంత్రి. అలాంటి నాయకుడు రాష్ట్రవసరాలకోసం కేంద్ర హోం మంత్రిని కలిస్తే.. అది తప్పు అని చెప్పడాన్ని మూర్ఖత్వం అనాలా.. పేపర్ లో ఫోటో కోసం ప్రాకులాట అనాలా అనేది పలువురి ప్రశ్నగా ఉంది!

చంద్రబాబుకు ఎలాగూ అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు.. కేవలం పలకరించడానికి అని తెలిస్తేనే ఫోన్ తీసుకుంటున్న పరిస్థితి. మరి ముఖ్యమంత్రి కూడా కేంద్రంలోని పెద్దలతో అలానే నడుచుకుని.. ఏపీకి చంద్రబాబు పట్టించిన గతే జగన్ కూడా పట్టించాలని.. బండారు లాంటి నేతలు కోరుకోవడంలో తప్పులేకపోవచ్చు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news