ప్ర‌ధాని మోదీని ప్ర‌శంసించిన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్

-

వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ (WHO) చీఫ్ టెడ్రోస్ భార‌త ప్ర‌ధాని మోదీని ప్ర‌శంసించారు. మోదీ శ‌నివారం జ‌రిగిన 75వ యునైటెడ్ నేష‌న్స్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా మోదీ.. ప్ర‌పంచ దేశాల‌కు వ్యాక్సిన్ అందించేందుకు భార‌త్ స‌హాయం చేస్తుంద‌ని అన్నారు. ఈ క్ర‌మంలో మోదీ చూపుతున్న చొర‌వ‌కు గాను టెడ్రోస్ ఆయ‌న‌ను అభినందించారు. ఈ మేర‌కు టెడ్రోస్ తాజాగా ఓ ట్వీట్ చేశారు.

who chief tedros praised indian prime minister modi

భార‌త్ ప్ర‌పంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ ఉత్ప‌త్తి కేంద్రంగా ఉంద‌ని మోదీ అన్నారు. అందువ‌ల్ల ప్ర‌పంచ దేశాల‌కు కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించే స‌త్తా భార‌త్‌కు ఉంద‌ని, తాము ఈ విష‌యంలో ఇత‌ర దేశాల‌కు స‌హాయం చేస్తామ‌ని తెలిపారు. కాగా మోదీ ప్ర‌పంచ దేశాల్లో క‌రోనాపై చేస్తున్న పోరాటానికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నందుకు ఆయ‌న‌కు టెడ్రోస్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్ర‌పంచ దేశాల‌న్నీ ఇలాగే క‌ల‌సిక‌ట్టుగా ఉండి స‌హ‌కారం అందించుకోవాల‌ని, అప్పుడే క‌రోనా వైర‌స్‌ను అంత‌మొందించ‌గ‌ల‌మ‌ని అన్నారు.

అయితే ఓ వైపు ప్ర‌పంచ దేశాలు క‌రోనాపై పోరాటం చేస్తుంటే ఐక్య‌రాజ్య‌స‌మితి ఏం చేస్తుంద‌ని కూడా మోదీ ప్ర‌శ్నించారు. కాగా దీనిపై టెడ్రోస్ స్పందించ‌లేదు. మ‌రోవైపు అమెరికా ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌తో క‌లిసి తాము ప‌నిచేయ‌బోమని, ఆ సంస్థ ప్ర‌పంచ దేశాల‌తో క‌లిసి వ్యాక్సిన్ కోసం కృషి చేస్తుంద‌ని, కానీ ఆ సంస్థ‌తో క‌లిసి వ్యాక్సిన్ కోసం ప‌నిచేయ‌బోమ‌ని ఇప్ప‌టికే అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలో మోదీ చేసిన ప్ర‌సంగంపై టెడ్రోస్ ప్ర‌శంస‌లు కురిపించ‌డం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news