శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం తరువాత ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ధ్వజావరోహణ ఘట్టంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుసాయి.
తొమ్మిది రోజులుగా జరిగిన ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా టీటీడీ నిర్వహించింది. తిరుమల చరిత్రలో ఏకాంతంగా జరిగిన బ్రహ్మోత్సవాలుగా ఇవి నిలిచిపోయాయి. వచ్చేనెలలో శ్రీవారి వార్షిక బహ్మోత్సవాలు జరుగనున్నాయి. వీటికి భక్తులను అనుమతించే విషయంపై ఇంకా నిర్ణయం జరుగలేదు.
– శ్రీ