తెలంగాణ బీజేపీలో కరోనా కలకలం కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు నేతలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి కూడా కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తనను కలిసిన వారు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. “గడిచిన 24 గంటలుగా మైల్డ్‌గా కరోనా లక్షణాలు కనిపించాయి. ఇప్పుడు జరిపిన పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
గత కొద్ది రోజులుగా నన్ను కలిసినవారు.. క్వారంటైన్‌లో ఉండాలని కోరుతున్నా.. ఒకవేళ లక్షణాలు ఉంటే వారు కూడా టెస్ట్‌లు చేయించుకోండి” అని వివేక్ పేర్కొన్నారు.ఇక, తన తండ్రి వెంకటస్వామి బాటలోనే రాజకీయాల్లలోకి అడుగుపెట్టిన వివేక్ వెంకటస్వామి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. 2009 నుంచి 2014 మధ్యకాలంలో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న వివేక్.. తెలంగాణ సాధనలో తనవంతు పాత్ర పోషించారు.