తెలివి తానొక్కడికే సొంతం.. తనలా ఎవరూ ఆలోచించలేరు.. తాను రాజకీయాల్లో అపర మేధావిని.. రాజకీయ పరిజ్ఞానంలో అపర కుభేరుడిని అని చంద్రబాబు తనగురించి తాను భావిస్తూ ఉండొచ్చు గాక.. కానీ తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఇంకొకడుంటాడన్న విషయం బాబు మరిచిపోకూడదు! ఈ విషయంలో బాబు మేధావితనాన్ని ఒకసారి పరిశీలిద్దాం!
త్వరలో తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నసంగతి తెలిసిందే! ఈ విషయంలో ఇక్కడ బీజేపీ పోటీచేసే అవకాశాలున్నాయని అంటున్నారు! అయితే… టీడీపీ ఈ ఎన్నికల్లో పోటీచేయదు! దానికి కారణం… ఇది మా సాంప్రదాయం, విలువలతో కూడిన రాజకీయం అని చంద్రబాబు & కో ఊకదంపుడు ఉపన్యాశాలు ఇవ్వొచ్చు కానీ… వాస్తవాలు వేరు!
ఎప్పుడో ముప్పైఏళ్ల క్రితం 1984లో తిరుపతి ఎంపీసీటు గెలుచుకుంది టీడీపీ! అనంతరం మళ్లీ తిరుపతి లోక్ సభ సీట్లో టీడీపీ నెగ్గలేకపోయింది! ఇక 2019 ఎన్నికల్లో అయితే చెప్పుకోలేని స్థాయిలో ఓడిపోయింది! సో… ఇప్పుడున్న పరిస్థుల్లో ఆ స్థానానికి టీడీపీ పోటీ చేసినా చేయకున్నా పెద్ద లెక్కుండదు.. మహా అయితే నోటా తో పోటీపడటం తప్ప!
మరి ఇంతోటి దానికి పోటీ చేయడం కంటే… ఆ సీటుకు పోటీ చేస్తున్న బీజేపీకి మద్దతు ఇచ్చేస్తే ఒక పని అయిపోతుందని బాబు భావిస్తున్నారంట! ఎలాగూ కచ్చితంగా నూటినీ నూరుపాళ్లు గెలవని సీటే కాబట్టి… ఒక వెంట్రుక బీజేపీకి మద్దతుగా వేస్తే… పొరపాటున బీజేపీ గెలిస్తే.. వారితో దోస్తానా కంటిన్యూ చేయొచ్చనేది బాబు ఆలోచనగా ఉందంట!
ఈ విషయం ఇప్పటికే గమనించిన ఏపీ బీజేపీ నేతలు.. వెంట్రుక వేసి కోండను లాగాలనే తెలివితేటలు బాబుకి ఉన్నాయన్న విషయం తమకు తెలుసని.. తాము అలాంటి పనిచేస్తే… ఈ సారి బాబు కాదు తాము చారిత్రక తప్పిదం చేసినవారమవుతామని చెబుతున్నారంట ఏపీ బీజేపీ నేతలు! హథ విధీ… ఎంత పని జరిగిపోయింది బాబూ!!
-CH Raja