మగాడా.. నీకు వందనం… నువ్వే అందరికీ ఆదర్శం..!

-

International Men's Day 2018

ఏంది మగాడిని తెగ పొగుడుతున్నారు అంటారా? ఇవాళ ప్రపంచ పురుషుల దినోత్సవం. అవును. నవంబర్ 19ని ప్రపంచ పురుషుల దినోత్సవంగా జరుపుకుంటారు. కానీ.. చాలామందికి అసలు పురుషుల దినోత్సవం అనేది ఒకటి ఉందనే తెలియదు. ప్రపంచ మహిళల దినోత్సవం చాలా మందికి గుర్తుంటుంది కానీ.. పురుషుల దినోత్సవం గుర్తుండక పోవచ్చు. మహిళల దినోత్సవం లాగానే పురుషుల దినోత్సవం కూడా జరుపుకోవడం కోసమే.. పురుషుల దినోత్సవం స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.

పురుషులు కుటుంబంలో, సమాజంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా, తండ్రిగా, మామయ్యగా, బాబాయిగా, తాతగా.. కుటుంబంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సమాజంలో కూడా పురుషుడి పాత్ర ఎంతో ముఖ్యమైంది. ఉద్యోగంలోనూ.. వాళ్ల పాత్ర ఎంతో ముఖ్యమైనది. కానీ.. కుటుంబంలో, సమాజంలో మగాడు ఎంతో వివక్షకు గురవుతున్నారు. తన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా… కుటుంబం, సమాజం బాగు కోసం మగాడు రాత్రింబవళ్లు కష్టపడుతుంటాడు. అందుకే.. ప్రపంచ పురుషుల దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగానైనా.. వివిక్షకు గురవుతున్న పురుషులపై అవేర్ నెస్ తీసుకురావడం కోసం, ఈ సమాజం కోసం అంతో ఇంతో చేసే మగాళ్లను ఈరోజున స్మరించుకుంటారు.

మీకు ఇంకో విషయం తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా 45 సంవత్సరాలలోపు ఉన్న పురుషుల్లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారట. కెరీర్ లో సెట్ కాని వాళ్లు, ప్రేమ సమస్యలు ఉన్నవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్లు … ఇలా చాలామంది మగాళ్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

ఇది మగాళ్ల ప్రపంచం. అంటే.. మగాళ్లు డామినేట్ చేసే ప్రపంచం అని చాలామంది అంటుంటారు. కానీ.. చాలామంది మగాళ్లు కూడా మహిళల చేతిలో వివక్షకు గురవుతున్నవారే. చాలామంది మగాళ్లు తాము వివక్షకు గురవుతున్నా బయటికి చెప్పుకోవట్లేదు. అందుకే పురుషులపై జరిగే దాడులు బయటికి రావట్లేవు. అందుకే.. పురుషులకు సంబంధించిన అన్ని విషయాలను వెలుగులోకి తీసుకురావడానికే ఈ ప్రపంచ పురుషుల దినోత్సవాన్ని ప్రారంభించారు.

1992 నుంచి పురుషుల దినోత్సవాన్ని చేసుకోవడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్ తో పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈసారి పాజిటివ్ మేల్ రోల్ మోడల్స్ థీమ్ తో పురుషుల దినోత్సవం మనముందుకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news