ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభమయ్యి క్రికెట్ ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే . ఈ సీజన్లో కొన్ని జట్లు బలమైన బ్యాటింగ్ బౌలింగ్ విభాగం తో ప్రత్యర్థి జట్టును ప్రతి మ్యాచ్లో చిత్తు చేస్తూ ఉంటే.. కొన్ని ఓట్లు మాత్రం ప్రతి మ్యాచ్లో కూడా సరైన అనుభవంగల ఆటగాళ్లు లేక… చివరికి వరుస ఓటములు చవిచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ లో ఒక జట్టులో ఆడిన ఆటగాడు మరో జట్టులో కూడా ఆడేందుకు అవకాశం ఉంటుందట.
ఐపీఎల్ 2020 సీజన్లో మిడ్ సీసన్ ట్రాన్స్ఫర్ కు అవకాశం కల్పించింది బీసీసీఐ . అంటే ఐపీఎల్ లో అన్ని జట్లు ఏడు మ్యాచ్ లు పూర్తి చేసుకున్న తర్వాత ఒక జట్టులోని ఆటగాళ్లు ఇతర జట్టుల్లోకి తీసుకునేందుకు వీలు ఉంటుంది. అయితే ఒక షరతు ఏమిటంటే ఒక జట్టులో ఆటగాడు ఒకటి లేదా రెండు మ్యాచ్లు తప్పక ఆడాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన వారు మిడ్ వేలంలో పాల్గొనేందుకు అవకాశం ఉండదు. సరిగ్గా ఏడవ మ్యాచ్ తర్వాత మాత్రమే అన్ని జట్లకు అవకాశం ఉంటుంది టెల్ మీ ద మ్యాచ్ తర్వాత మళ్ళీ ఈ అవకాశాన్ని కోల్పోతారు అందరు.