ఆ విజ‌య‌వాడ టీడీపీ నేత‌కు పెద్ద టాస్కే ఉందే..!

-

టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా అధినేత చంద్రబాబు…ఇటీవల పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కృష్ణా జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాలకు కొత్త అధ్యక్షులని నియమించారు. జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలు ఉంటే రెండు స్థానాలు అంటే నూజివీడు, కైకలూరు స్థానాలు ఏలూరు పార్లమెంట్ పరిధిలోకి వెళ్తాయి. వాటిని పక్కనబెడితే విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులుగా నెట్టెం రఘురాం, కొనకళ్ళ నారాయణలని నియమించారు.

అయితే ఇందులో నెట్టెం తన పార్లమెంట్ పరిధిలో రెండు నియోజకవర్గాలని సెట్ చేయాల్సి ఉంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్, తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో ఐదు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ నేతలు బాగా యాక్టివ్‌గా ఉన్నారు. మైలవరం-దేవినేని ఉమా, నందిగామ-సౌమ్య, జగ్గయ్యపేట-శ్రీరామ్ తాతయ్య, ఈస్ట్-ఎమ్మెల్యే గద్దె రామ్మోహాన్, సెంట్రల్-బోండా ఉమాలు దూకుడుగా పనిచేస్తున్నారు.

ఇక మొన్న ఎన్నికల్లో తిరువూరులో ఓడిపోయిన మాజీ మంత్రి కే‌ఎస్ జవహర్ ఇప్పుడు రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్నారు. పైగా ఆయన కొవ్వూరు స్థానానికి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో తిరువూరులో నల్లగట్ల స్వామీదాస్‌కే మళ్ళీ అవకాశం ఇవ్వాలి..లేదా కొత్త నాయకుడుని పెట్టాలి. ఇటు విజయవాడ వెస్ట్‌లో జలీల్ ఖాన్ యాక్టివ్‌గా లేరు. ఆయన తనయురాలు షబానా కూడా అందుబాటులో లేరు. దీంతో ఇక్కడ కొత్త నాయకుడుని పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ రెండు చోట్ల నెట్టెం పార్టీని సెట్ చేయాల్సిన అవసరముంది.

ఇటు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో పెడన, గుడివాడ, గన్నవరం, పెనమలూరు, పామర్రు, మచిలీపట్నం, అవనిగడ్డ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో మచిలీపట్నం-కొల్లు రవీంద్ర, పెనమలూరు-బోడే ప్రసాద్‌లు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు. ఇక గన్నవరం నియోజకవర్గానికి ఇటీవలే బచ్చుల అర్జునుడుని ఇన్‌చార్జ్‌గా పెట్టారు. ఈయన ఇంకా నియోజకవర్గంలో పని మొదలుపెట్టలేదు.

అటు పామర్రులో ఉప్పులేటి కల్పన, అవనిగడ్డలో మండలి బుద్దప్రసాద్, పెడనలో కాగిత వెంకట కృష్ణప్రసాద్, గుడివాడలో రావి వెంకటేశ్వరరావులు పెద్దగా యాక్టివ్‌గా లేరు. ఇక వీరిని లైన్‌లో పెట్టి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కొనకళ్ళదే. మొత్తానికైతే కొనకళ్ళకు పెద్ద టాస్క్ ఉన్నట్లు ఉంది.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news