హీరో కమ్ ప్రొడ్యూసర్‌గా రెండు పడవల ప్రయాణం…!

-

రవిబాబు ‘నువ్విలా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హవీష్ యాక్టింగ్‌తో పాటు ప్రొడక్షన్‌పైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. హీరోగా సూపర్‌ స్టార్డమ్ సంపాదించుకోవడానికి కథలు వింటూనే, నిర్మాతగా సినిమాలు తియ్యడానికి ప్రిపేర్ అవుతున్నాడు. హవీష్‌ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. హీరోగా కెరీర్‌ని బెస్ట్‌ స్టేజ్‌కి తీసుకెళ్లడానికి వర్కవుట్స్‌ చేస్తూనే ప్రొడ్యూసర్‌గా సక్సెస్‌ అందుకోవడానికి స్కెచ్చులేస్తున్నాడు. హీరో కమ్ ప్రొడ్యూసర్‌గా జర్నీని పీక్స్‌కి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు.

హవీష్ సొంత బ్యానర్‌లో బ్యాక్‌ టు బ్యాక్ మూవీస్ ప్రొడ్యూస్‌ చెయ్యడానికి కథలు రెడీ చేసుకుంటున్నాడు. రీసెంట్‌గానే ‘రాక్షసుడు’సినిమాతో నిర్మాతగా సూపర్ హిట్‌ అందుకున్న హవీష్, ఈ మూవీని హిందీలో కూడా రీమేక్ చెయ్యాలనుకుంటున్నాడు. అలాగే రవితేజతో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాడు. వీటితోపాటు మరో రెండు సినిమాలని లైన్‌లో పెడుతున్నాడు హవీష్.

Read more RELATED
Recommended to you

Latest news