కరోనా కారణంతో ఒకవైపు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సినీ పరిశ్రమకు…భారీ బడ్జెట్ చిత్రాలు పెద్ద హెడేక్ గా మారిపో్యాయి. ప్రి అండ్ పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న అన్ని సినిమాలు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులే కావడంతో మనీ మ్యాటర్లో వెనకడుగు వేయలేకపోతున్నారు నిర్మాతలు. కాస్ట్ కటింగ్ కాన్సెప్ట్ ఫుల్ గా రన్ అవుతున్నప్పటికీ పైకి చెప్పుకోలేని పరిస్థితి.ఎక్కడ చెబితే ఎక్కడ బిజినెస్ తేడా కొడుతుందో తెలియదు. సినిమాలు తీసేవాళ్లలోనూ ఆందోళన యథావిధిగా కంటిన్యూ అవుతూఉంది. అందుకే 2020వినోద పరిశ్రమల పాలిట శాపంగా బిగ్ బర్డెన్ గా మారిపోయింది.
ఇటు టాలీవుడ్ నిర్మాతలకు బాలీవుడ్ బిగ్ హ్యాండ్స్ సాయం అందిస్తూ ఉండడంతో భారీ చిత్రాలు చేసే ప్రయత్నాల్లో మనవాళ్లు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. కరణ్ జోహార్ సహా పలు అగ్ర డిస్ట్రిబ్యూటర్లు బాలీవుడ్ నుంచి తెలుగు సినీనిర్మాతలతో టై అప్ లకు సై అనేస్తుంటే మార్కెట్లో పాన్ ఇండియా తప్పు కాదనే భావన ఏర్పడింది.
మెగా కాంపౌండ్ హీరోలు పాన్ ఇండియా ఫిలింస్ తో హల్చల్ చేయాలని, తమ మార్కెట్ పరిధి పెంచుకోవాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు. ఈ విషయంలో చెర్రీ,బన్నీలు మాంచి స్సీడ్ మీదున్నారు.బహుశ ఇలా చేయడం….బిటౌన్ హీరోల మాదిరిగా బ్రాండ్ పెంచుకునే ప్రాసెస్ లో వేసిన కొత్త స్కెచ్ కావచ్చు.అరవ హీరోలతో పాటు తెలుగు హీరోలు కూడా తమ హీరోయిజాన్ని పెంచుకునే ప్రాసెస్లో … నిర్మాతల బర్డెన్ ను పట్టించుకోకుండా భారీ బడ్జెట్ చిత్రాలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో వారు సక్సెస్ అవుతారా లేదా అన్నది పక్కన పెడితే ఈ బిగ్ బర్డెన్స్ వారి సొంత బ్యానర్లో ఎందుకు చేయరు అనే కామెంట్స్ పడుతున్నాయి.