వివాదాస్పద ట్రంప్ మరో సారి తన నోటి దురదని చూపించారు. తాజాగా ఆయన ఇండియా పై నోరు పారేసుకున్నారు. అమెరికా ఎన్నికల్లో జరిగిన ఫైనల్ డిబేట్ లో ఇండియాలో కాలుష్యం ఎక్కువంటూ ఫిల్తీ ఇండియా అంటూ కామెంట్స్ చేశాడు. మన దేశంతో పోలుస్తూ అమెరికాలో పర్యవరణానికి చాలా ప్రాధాన్యం ఇచ్చానని చెప్పుకొచ్చారు ట్రంప్.
ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫైనల్ ప్రెసిడెన్షియల్ డిబేట్ ఆసక్తికరంగా సాగింది. కరోనాను ఎదుర్కోవడంలో ట్రంప్‌కు సమగ్ర ప్రణాళిక లేదని బైడెన్ ఆరోపిస్తే వ్యాధి సమర్థంగా ఎదుర్కొంటున్నామని ట్రంప్ చెప్పారు. యూరప్ దేశాల కంటే అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందన్నారు. కొన్ని వారాల్లోనే వైరస్‌కు వ్యాక్సిన్ రాబోతుందని మిలటరీ ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ప్రకటించారు ట్రంప్.