తెలుగు వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు… వీడియో

-

Man lynched to death in Cuddalore, TN over robbery suspicions?

తెలుగు వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు తమిళియన్లు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరులో చోటు చేసుకున్నది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు.

ఓ తెలుగు వ్యక్తి దొంగతనం చేశాడన్న నెపంతో అతడి చేతులు కట్టేసిన అక్కడి స్థానికులు అతడిపై దాడి చేశారు. విపరీతంగా కొట్టారు. నన్ను కొట్టొద్దు… నేను చచ్చిపోతా.. అని ఆ వ్యక్తి తెలుగులో వేడుకున్నా కూడా వినలేదు. అతడిని తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అందరూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో సంబంధమున్న నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇక.. మృతుడి వయసు 45 వరకు ఉంటుందని.. అతడి పూర్తి వివరాలు తెలియలేదని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news