అమరుల కుటుంబానికి రూ.10 లక్షలు : రాహుల్

-

ప్రజా కూటమి అధికారంలోకి రాగానే అమరుల కుటుంబానికి రూ.10 లక్షలు అందిస్తామని ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రాజెక్టులకు కేసీఆర్ రీడిజైన్ పేరిట కోట్లు దోచుకున్నారన్నారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ…ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్పు కోసమే రూ.40వేల కోట్లకు పైగా వెచ్చించారన్నారు., ప్రపంచంలో పేరు మార్పు కోసం అత్యధికంగా ఖర్చుపెట్టిన ప్రాజెక్టు ఇదేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తాం. 17 పంటలకు మద్దతు ధర ఇస్తామన్నారు. తెలంగాణ కోసం పోరాడిన యోధులను కేసీఆర్ మరిచిపోయారని ఆరోపించారు. ‘‘తెలంగాణలో ఈ ప్రజా కూటమి తెలంగాణకే కాదు, దేశానికి కూడా మార్గదర్శిగా మారనుంది. మీ జోష్ చూస్తుంటే తెలంగాణలో కూటమి అధికారంలోకి వస్తుందని స్పష్టమవుతోందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని భాజపాతో తెరాస రహస్య స్నేహం చేస్తుందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news