టీడీపీకి మరో షాక్‌..ఈ సారి ఆ నేత జంప్‌..!

-

ఏపీలో రాజకీయాలు ఎప్పుడు హాట్‌ హాట్‌గానే సాగుతాయి..నేతల పార్టీల ఫిరాయింపులతో నిత్యం కోలాహలంగా ఉంటాయి పార్టీ ఆఫీసులు..మరి ముఖ్యంగా అధికార పార్టీ ఆఫీస్ ఎప్పుడు కొత్త నేతలలో కలకలాడుతాయి..టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీ నుంచి..వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ నుంచి వలసలు కోనసాగుతాయి..ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ముందు మొదలైన వలసలు ఇప్పటికీ ఆగలేదు..ఎన్నికలకు ముందే పలువురు నేతలు టీడీపీ, బీజేపీ పార్టీలకు గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరారు..స్థానిక సంస్థలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీని నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి..టీడీపీ అధిష్టానం కొత్త జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తర్వాత చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నారు..అయితే ఈ కమిటీల్లో తమకు స్థానం లేకపోవడంతో కొందరు నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత చెలికాని వీరవెంకట సత్యన్నారాయణ సీతారామస్వామి పార్టీకి గుడ్ బై చెప్పేశారు..తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు..తాను టీడీపీకి 18 ఏళ్లుగా సేవలు చేస్తున్నా అధిష్టానం పట్టించుకోలేదని, కనీసం కమిటీల్లో సభ్యుడిగా కూడా చోటివ్వలేదని తీవ్ర అసంతృప్తికి లోనైన సీతారామస్వామి పార్టీ నుంచి బయటకు వచ్చారు..టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని..పార్టీ అధిస్ఠానం తనను పట్టించుకోవడం లేదని అందుకే టీడీపీని వీడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..టీడీపీలో నిజాయితీగా పని చేసిన వారికి తగిన గుర్తింపు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సీతారామస్వామి..త్వరలో రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news