చరిత్రలో నిలిచిపోయేలా అమరావతిని కడతానని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అమరావతి ఉండదని ప్రకటించడంతో అల్లా డుతున్నారు. ఈ క్రమంలోనే ఉద్యమాలు చేస్తున్నారు చంద్రబాబు. అమరావతి అజెండాగా ఎన్నికలకు వెళ్దామని ప్రభుత్వ పార్టీకి పిలుపునిచ్చారు. తీరా ఛాన్స్ వచ్చే సరికి.. బాబు యూటర్న్ తీసుకున్నారు-ఇదీ ఇప్పుడు మేధావులు చెబుతున్న మాట. చేస్తున్న విమర్శ! మరి ఏం జరిగింది? రాజధాని విషయంలో ఆది నుంచి ఒకే స్టాండ్‌పై ఉన్న చంద్రబాబు అన్ని రూపాల్లోనూ జగన్ సర్కారుపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ఈ క్రమంలోనే రాజధాని రైతులతో ఉద్యమాన్ని ప్రారంభించారు.
అదేసమయంలో రాజకీయంగా కూడా దూకుడు ప్రదర్శించి.. పలు జిల్లాల్లో తిరిగి జోలె పట్టారు. ఇంత చేసిన చంద్రబాబు.. మంచి మార్కులు బాగానే ఖాతాలో వేసుకున్నారు. ఒకానొక దశలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. చంద్రబాబు ప్రభుత్వంలోకి వచ్చే స్తారనే టాక్ కూడా వచ్చేసింది. అంతేకాదు.. టీడీపీ నాయకులు ఏకంగా.. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఇక, రాజధాని రైతులకు బాబు.. దేవుడే అయిపోయారు. నిత్యం ఆయన చెప్పినట్టే వింటున్నారని… ఆయన చెప్పినట్టే ఆందోళనలకు దిగుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
సరే! ఒక మంచి కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నప్పుడు.. ఎవరు నడిపించినా.. దీనికి పోయేదేమీలేదు. ఇక, ఇప్పుడు కీలక పరిణామం తెరమీదికి వచ్చింది. తిరుపతి ఉప ఎన్నిక త్వరలోనే జరగనుంది. ఈ క్రమంలోనే మేధావుల మదిలో ఓ ఆలోచన మెరిసింది. ఉప ఎన్నికలో రాజధాని రైతుకు లేదా ఉద్యమాన్ని బలపరుస్తున్న టీడీపీ నాయకుడికి టికెట్ ఇచ్చి.. రాజధాని ఉద్యమాన్ని హైలెట్ చేస్తే.. బాబుకు తిరుగు ఉండదని.. అదే సమయంలో జగన్ ప్రభుత్వ భవితవ్యం కూడా తేలిపోతుందని అనుకున్నారు.
నిజానికి రాజధాని రైతులు కూడా దీనికి రెడీగానే ఉన్నారు. కానీ, చంద్రబాబు మాత్రం పనబాక లక్ష్మికి కేటాయించారు. వాస్తవానికి ఆమె ఇన్నాళ్లలో ఏనాడూ రాజధాని పై ఒక్కమాట మాట్లాడలేదు. బయటకు కూడా రాలేదు. కేవలం రాజకీయాలు. వ్యక్తిగత లబ్ధే పరమావధిగా ఉన్నారని టీడీపీ నేతలే గతంలో ఆరోపించారు అలాంటి మహిళకు ఇప్పుడు బాబు టికెట్ కేటాయించడం అంటే.. తప్పు చేయడమేనని అంటున్నారు మేధావులు. మరి బాబు ఆత్మ విమర్శ చేసుకుంటారా? చూడాలి..!