ఆస్తమా ఉంది… ఏసీ బస్సు ఎక్కి చచ్చిపోయాడు…!

-

కరోనా సమయంలో ఇప్పుడు కొన్ని మరణాలు ప్రజలను బాగా భయపెడుతున్నాయి. ఎలా మరణిస్తున్నారో అర్ధం కావడం లేదు కొందరు సడెన్ గా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సులో బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్తున్న వ్యక్తి బస్సులో మృతి చెందాడు. మృతుడికి ఆస్మా ఉండడంతో ఎసి బస్సులో ప్రయాణం చేస్తూ ఊపిరాడక చనిపోయాడని బస్సు సిబ్బంది చెప్తున్నారు.

Mortician, medical examiner covering dead body in morgue

ఇతనికి రెండు రోజుల నుంచి జ్వరం ఉండడంతో తన స్నేహితునితో కలిసి తమ ఊరు వెళ్తూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడుది శ్రీకాకుళం జిల్లా రాంపురంగా గుర్తించారు. బస్సు నెల్లూరు జిల్లా కావలి పరిసర ప్రాంతాలకు వచ్చే సరికి మృతి చెంది ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. కావాలి రూరల్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news