సినీ పరిశ్రమకు కేసీఆర్ శుభవార్త

-

తెలుగు సినీ పరిశ్రమ ని మళ్ళీ పూర్తి స్థాయిలో నిలబెట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెకంగన సిఎం కేసీఆర్ ప్రకటించారు.కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు కేసీఆర్ ఈరోజు కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. ఈరోజు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు.

ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం, సిని ఇండస్ట్రీ పెద్దలు కలిసి పరిశ్రమను కాపాడుకోవడానికి సంయుక్త ప్రయత్నాలు చేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వ పరంగా సినీ పరిశ్రమను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసే మేనిఫెస్టోలో సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరోజు సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణ్ దాస్ నారంగ్, కె ఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి.కళ్యాణ్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు సిఎంను కలిశారు.

Read more RELATED
Recommended to you

Latest news