టిటిడి ఆస్తుల విక్రయంపై హై కోర్టులో విచారణ జరిగింది. టిటిడి ఆస్తులపై శ్వేతపత్రం ఎప్పుడు విడుదల చేస్తారని హై కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. టిటిడికి ఉన్న ఆస్తులు, దాతలు ఇచ్చిన ఆస్తులు వివరాలను గురించి శ్వేతపత్రం విడుదల గురించి హై కోర్టు ప్రస్తావించింది. ప్రజలకు, భక్తులకు, దాతలకు ఈ సమాచారం అవసరం అని పేర్కొంది. గతంలో శ్వేతపత్రం ప్రకటిస్తామని టిటిడి ఈఓ అఫడవిట్ లో పేర్కొన్న విషయాన్ని కోర్ట్ గుర్తు చేసింది.
ఈ నెల 14వ తేదికి విచారణ వాయిదా వేసింది. పిటీషనర్ తరుపున వాదనలు న్యాయవాది వై. బాలాజి వినిపించారు. దేవాదాయ శాఖ అనుమతి లేకుండా టిటిడి ఆస్తులు విక్రయిస్తోందని న్యాయవాది పేర్కొన్నారు. స్థిర, చరాస్థులకు సంబంధించి వాటిని కాపాడే విషయంలో ఎటువంటి పారదర్శకత పాటించడం లేదని పిటీషనర్ వాదించారు. ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత వాటిపై టిటిడి పై ఉందని పిటీషనర్ పేర్కొన్నారు.