ప్రభాస్ పై సాయి ధరమ్ తేజ్ కామెంట్.. నిజంగా సూపర్..

-

హీరోల మధ్య ఇగోలు ఉంటాయని, అందుకే తమ పోటీ హీరోని గానీ, సినిమాలని గానీ పొగడడానికి ఇష్టపడరని ఇండస్ట్రీ బయట వ్యక్తులు మాట్లాడుకుంటారు. ఒకే ఫీల్డ్ లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీతత్వం ఉంటుంది కాబట్టి ఇలా అనుకోవడం సహజమే. ఐతే హీరోలందరూ అలాగే ఉంటారనుకుంటే మాత్రం పొరపాటే. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఒకరి సినిమాల గురించి ఒకరు చెప్పుకోవడం, ప్రశంసలు కురిపించడం చూస్తున్నాం. అలాంటి వారిలో హీరో సాయి ధరమ్ తేజ్ ఒకరు.

తాజాగా సోలో బ్రతుకే సో బెటరు సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన సాయి తేజ్, బాహుబలి స్టార్ ప్రభాస్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళుతున్నాడని, తెలు చిత్ర పరిశ్రమలో ఒక భాగం అయినందుకు గర్వంగా ఉందని తెలియజేశాడు. ఇంకా, ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాపై చాలా ఆసక్తి నెలకొందని వెల్లడి చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news