వరంగల్ లో మంత్రి సోదరున్ని టార్గెట్ చేసిన బీజేపీ

-

తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆకర్ష్ మొదలైంది. దుబ్బాక.. గ్రేటర్లో ఎన్నికల్లో జోరుచూపించిన బీజేపీ అదే దూకుడును రాష్ట్రమంతటా చూపించాలని తహతహలాడుతోంది. త్వరలోనే జరుగబోయే వరంగల్.. ఖమ్మం ఎన్నికల పై ఫోకస్ పెట్టిన బీజేపీ పెద్ద చేపలకే ఎర వేస్తుంది. ఇందులో బాగంగా వరంగల్ జిల్లాలోని మంత్రి ఎర్రబెల్లి సోదరుడిని టార్గెట్ చేసింది. .

దుబ్బాక,గ్రేటర్ ఊపుతో ఉన్న బీజేపీ త్వరలో జరిగే వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్..పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. సాగర్ ఉప ఎన్నికల్లో సత్తాచాటాలని ఉవ్విళ్లురుతోంది. ఈక్రమంలోనే బీజేపీ ఉద్యమాల పురిటిగడ్డ అయినా ఓరుగల్లుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. త్వరలోనే వరంగల్ కార్పొరేషన్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలపై బీజేపీ కన్నేసింది. టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న ముఖ్య నేతలతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు.

రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు ముందే బీజేపీలో చేరేందుకు చాలామంది టిఆర్ఎస్ ముఖ్య నేతలు క్యూ కడుతున్నారు. . మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు.. శాప్ మాజీ డైరెక్టర్ రాజనాల శ్రీహరితో పాటు గ్రేటర్ వరంగల్ పరిధిలోని పదిమంది కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని టాక్ ఓరుగల్లు టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.పార్టీలో కోన్ని రోజులుగా పెద్దగా ప్రాదాన్యత లేని ప్రదీప్ రావు చాల అసంతృప్తిగా ఉన్నారు. వరంగల్ తూర్పు నియోజక వర్గంలో కాని జిల్లా నేతలు కాని ఆయను పట్టించుకోవడం లేదు.

మంత్రి సోదరుడైన ప్రదీప్ రావుకు వరంగల్ అర్బన్.. రూరల్ ఎమ్మెల్యేలతో నిత్యం యుద్ధమే నడుస్తోంది. ప్రదీప్ రావు తెలంగాణ నెక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అంగన్ వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా విషయంలో ఎమ్మెల్యేలు తరుచూ ప్రదీప్ రావును టార్గెట్ చేస్తుండటంతో ఆయన టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రదీప్​రావుకు వరంగల్​ పశ్చిమ.. తూర్పు ఎమ్మెల్యేలతో పొసగడం లేదని టాక్ కొన్నిరోజులుగా నడుస్తుంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి తమ్ముడు అనే కారణంతో ప్రదీప్ రావును టార్గెట్ చేయడంతోపాటు ఆయన అనుచరులపై కేసులు కూడా నమోదు చేయించినట్లు ఆరోపణలున్నాయి.

ఈవివాదాల నేపథ్యంలో ప్రదీప్ రావు వరంగల్​ తూర్పు సెగ్మెంట్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట.అయితే దీనిని ముందే పసిగట్టిన వరంగల్​ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ప్రదీప్​రావు పై కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నాడట. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు ప్రదీప్ రావును బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. ఆయన అనుచరులు వరంగల్ తూర్పు నుండి కీలకంగా ఉన్న నేత రాజనాల శ్రీహరి కూడా బీజేపీ లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సిగ్నల్స్ పంపారట. వీరితోపాటు 8మంది కార్పొరేటర్లు కూడా ఓ భారీ సభ పెట్టి బీజేపీలో చేరేందుకు ప్యూహం సిద్దం చేసుకున్నారట.

ఈ ప్రచారానికి భలం చేకురేలా ప్రదీప్ రావు,రాజనాల శ్రీహరి బిజెపి సినియర్ నేతలు డికే ఆరుణ ఎంపి ఆరవింద్ కుమర్. కిషన్ రెడ్డిలతో మంతనాలు జరిపారు. ఇక ప్రదీప్ రావు,శ్రీహరి బీజేపీలో చేరడం ఖాయమని తెలియడంతో టీఆర్ఎస్ నేతలు అలర్టయ్యారు. మంత్రులు.. ఎమ్మెల్సీలు రంగంలోకి దిగి ప్రదీప్ వెంట కార్పొరేటర్లు వెళ్లకుండా బుజ్జగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news