డ్యాన్సర్ సూసైడ్ లో నిముషానికో ట్విస్ట్.. భర్త కాక మరో ఇద్దరితో అఫైర్ ?

-

ఈవెంట్ డాన్సర్ గాయత్రి ఆత్మహత్య కేసు నిముషానికో మలుపు తిరుగుతోంది. బెజవాడలో డ్యాన్సర్ గాయత్రి సూసైడ్ కేసు మలుపులు తిరుగుతోంది. వివాహేతర సంబంధమే ఈ సూసైడ్‌కు కారణమని భావిస్తున్నారు పోలీసులు. అయితే మృతురాలి భర్తతో పాటు తల్లిదండ్రులు గాయత్రి ఫ్రెండ్‌ నీలిమానే కారణమని ఆరోపిస్తున్నారు. ఇక నీలిమా మాత్రం గాయత్రి తన భర్త  వేధింపులు వల్లే ఆత్మహత్య చేసుకుందని చెబుతోంది. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు అసలు నిజం తేల్చే పనిలో పడ్డారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలో నివాసముంటున్న గాయంత్రి బన్నీ అనే వ్యక్తి  బృందంలో ఈవెంట్‌ డ్యాన్సర్‌గా పని చేస్తోంది.

అయితే గాయిత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడటం స్థానికంగా కలకలం లేపింది. విచారణలో గాయిత్రికి ఆమె ఫ్రెండ్ నీలిమ భర్త బన్నీకి వివాహేతర సంబంధం ఉందని తేల్చారు పోలీసులు. ఈ కారణంగానే నీలిమ వచ్చి గాయత్రిని మందలించి వెళ్లిందని ఆ తర్వాత గాయత్రి సూసైడ్ చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. అంతే కాక గాయత్రి సహచర డ్యాన్సర్ సునీల్ మధ్య వివాహేతర సంబంధం ఉందని నీలిమ‌ గుర్తించిందని నీలిమ ఇక పై పని చేయక్కర్లేదని గాయత్రి ఇంటి వద్దకు వెళ్ళి చెప్పిందని ఒక వేళ ఆ కారణంగా కూడా ఏమైనా సూసైడ్ చేసుకుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news