పొలిటికల్ స్క్రీన్ పై ప్రొ.కోదండరాం ఒటరయ్యారా

-

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోయిన కోదండరాం కి ఇప్పుడు అవే రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టేస్తున్నాయా..? అంటే అవుననే అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. పొలిటికల్ సైన్స్ పాఠాలు చెప్పిన కోదండరాం కి రాజకీయ పార్టీలు…ఇప్పుడు ప్రాక్టీకల్స్ చూపెడుతున్నట్టు కనిపిస్తుంది. ఎంతో మందికి పొలిటికల్ పాఠాలు చెప్పిన ఆయనకు…ఇప్పుడు రాజకీయ పార్టీలు పాఠాలు చెప్తున్నాయా..? అందరూ మనవాళ్లే అనుకుని…ఇప్పుడు ఒక్కడే అయ్యాడా..?

ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో కలిసి పని చేసిన కోదండరాం…ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తన దారి తను వెతుక్కున్నారు. నల్గొండ..ఖమ్మం.. వరంగల్ నియోజకవర్గంలో ఒంటరి పోరు మొదలుపెట్టారు. కాలికి బలపం కట్టుకుని మూడు జిల్లాలు చుట్టుతున్నారు. కాంగ్రెస్ నుండి మొదట్లో మద్దతు ఆశించినా… ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. గతంలో కాంగ్రెస్ నుండి మద్దతు ఆశించారు. అయితే కొందరు నాయకులు కోర్ కమిటీ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో కోదండరామ్ సైలెంట్ అయ్యారు. పార్టీ కి మంచి పట్టున్నా చోట మనమే అభ్యర్థిని పెట్టాలని పార్టీలో డిమాండ్ వచ్చింది. దింతో ఎవరికి మద్దతు ఉండదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.కానీ ఇప్పుడు అది కూడా లేదు.

కాంగ్రెస్ ని నమ్ముకుంటే అంతే డిసైడ్ అయిన కోదండరాం తన పని తాను చేసుకుంటున్నారు. ఇక లెఫ్ట్ పార్టీలు కూడా కోదండరాం కి హ్యాండ్ ఇచ్చాయి. ముందస్తు ఎన్నికలో కాంగ్రెస్ తో బలవంతంగా కలిపిన సీపీఐ కూడా ఇప్పుడు కోదండరాం కి మద్దతు ఇవ్వడం లేదు. సీపీఐ.. సీపీఎం పార్టీలు ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించింది. ఉద్యమాల్లో కలిసి పని చేయడానికి కోదండరాం కావాలి కానీ… ఎన్నికల్లో మాత్రం ఎవరి దారి వారు అన్నట్టు వ్యవహారం చేశారు. హ్యాండ్ ఇవ్వడంలో కాంగ్రెస్ అనుకున్నారు కానీ… కామ్రేడ్స్ కూడా అదే తొవ్వలో పడిపోయారు. ఖమ్మం.. నల్గొండలో లెఫ్ట్ ఓటు బ్యాంకు ఉంటుంది. ఇది కలిసి వస్తుందని కోదండరామ్ అనుకున్నారు. కానీ తీరా ఎన్నికల సమయం కి హ్యాండ్ ఇచ్చారు. దీన్ని పార్టీలో సీనియర్ నాయకుడు నారాయణ కూడా వ్యతిరేకించారట.

హైదరాబాద్ లో ప్రో. నాగేశ్వర్ కి మద్దతు పలుకుతున్నప్పుడు… నల్గొండ..వరంగల్ లో కూడా విద్యావేత్త కోటలో కోదండరాం కి మద్దతు ఇస్తే మంచి సంకేతం వెళ్తుంది అని సూచన చేశారట. అయితే పార్టీ మత్గ్రాం ఇప్పటికే అభ్యర్థిని పెట్టాలని నిర్ణయం చేసిన నేపథ్యంలో అదే నిర్ణయాన్ని అమలుచేసింది. లెఫ్ట్ పార్టీలు ఐక్యత కు ఈ ఎన్నికల్ని వాడుకోవాలని చూస్తుంది. సో…కామ్రేడ్ల ఎత్తుగడలో కోదండరాం ఒంటరి అయ్యారు.

రాజకీయ పాఠాలు చెప్పడం కంటే…ప్రాక్టీకల్స్ ముఖ్యం అనేది ప్రొఫెసర్ కి అర్థమై ఉంటుంది. ఎంతైనా పాపం..ఇప్పుడు ఏక్ నిరంజన్ అయ్యారు. తన కష్టాన్ని తాను నమ్ముకుని గ్రౌండ్ లో ఉంటున్నారు !

Read more RELATED
Recommended to you

Latest news